IndiGo staff: సీతారాముల వేషధారణలో ఇండిగో స్టాఫ్.. వీడియో వైరల్
అయోధ్యలో రామమందిరం ఉత్సవఏర్పాట్లు గొప్ప ఆర్భాటంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండిగో ఎయిర్ సర్వీస్ సిబ్బంది వినుత్నంగా సీతారాములు వేషధారణలో ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
IndiGo staff dressed as Sitaram at Ahmedabad-Ayodhya airport.. Video viral
IndiGo staff: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రామమందిరం(Ram Temple) ఉత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. జనవరి 22న జరిగే ఈ కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి ప్రముఖులు హాజరు అవుతున్నారు. చరిత్రలో నిలిచిపోయేలా అయోధ్య రామమందిరం విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతుందని జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండిగో ఎయిర్(IndiGo staff) సర్వీస్ స్టాఫ్ వినుత్న ప్రదర్శన చేసింది. అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి అహ్మదాబాద్ నుంచి ఇండిగో సంస్థ తన తొలి విమానాన్ని ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ విమానాశ్రయంలో పనిచేసే స్టాఫ్ సీతారామ లక్ష్మణ, హనుమ వేషధారణలో ప్రయాణికులను పలకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
అహ్మదాబాద్- అయోధ్యల మధ్య వారానికి మూడు రోజుల ఇండిగో విమానం నడపడానికి సిద్ధం అయింది. ఈ విమానాన్ని లఖ్నవూ నుంచి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గురువారం వర్చువల్గా ప్రారంభించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా యోగితో వర్చువల్గా పాల్గొన్నారు. ఈ క్రమంలో ఇండిగో సిబ్బంది శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడి వేషధారణ ధరించారు. ప్రయాణికులను ఆహ్వానం పలికారు. హనుమంతుడి వేషధారణలో మరో ఉద్యోగి మోకాలిపై నిల్చొని ఉన్నాడు. ఇండిగో సిబ్బంది నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎయిర్ పోర్ట్ ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. వారి సెల్ఫోన్లలో ఈ దృష్యాన్ని బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.