జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్థాన్ దేశాలు చర్చల ద్వారా కశ్మీర్ అంశంపై ఒక పరిష్కారానికి రావడం ఉత్తమమని సూచించారు. ఒకవేళ అలా జరగకపోతే కశ్మీర్ పరిస్థితి గాజాలా మారుతుందని వ్యాఖ్యనించారు.
కివిడ్ ఉదృతంగా ఉన్న సమయంలో ఉద్యోగుల వైద్య, ఆర్థిక అవసరాల మేర తీసుకొచ్చిన కొవిడ్ అడ్వాన్స్ సదుపాయాన్ని నిలిపివేస్తూ ఈపీఎఫ్ఓ కీలక ఆదేశాలు జారీ చేసింది.
వాణిజ్య, వ్యాపార సంస్థల బోర్డులపై కన్నడ అక్షరాలనే రాయలని కర్ణాటక రక్షణ వేదిక చేసిన విజ్ఞప్తిపై కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కన్నడ భాషకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. బోర్టులపై 60శాతం కన్నడ అక్షరాలే ఉండాలని ఆదేశించింది. దీంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు దుకాణాలపై, షాపులపై పడి బోర్డులను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకున్నారు.
దేశంలో రోజురోజుకి కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పాజిటివ్ అని తేలితే సూచనలు పాటించాలని తెలిపింది.
ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీపై బాంబు దాడి తీవ్ర కలకలం రేపింది. సీసీ కెమెరా ఆధారంగా ఇద్దరు అనుమానితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తమ దేశాన్ని గుర్తించేలా ఏది ఒంటిపై ప్రదర్శించొద్దని జాతీయ భద్రతా మండలి స్పందించింది.
బీజేపీకి వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేసేందుకు కొద్ది నెలల క్రితం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈసారి దేశంలోని తూర్పు నుంచి పశ్చిమ ప్రాంతం వరకు భారత్ న్యాయ యాత్ర చేపట్టనున్నారు.
శబరిమల ఆలయానికి భక్తులు పోటెత్తారు. నేడు ఆలయంలో మండల పూజ నిర్వహించనున్నారు. ఆ పూజ తర్వాత రాత్రి 11 గంటలకు ఆలయ తలుపులను అధికారులు మూసివేయనున్నట్లు ప్రకటించారు. చివరి రోజు కావడంతో శబరిమలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.
ఇటీవల కోవిడ్-19 కేసులలో పెరుగుదల కనిపిస్తోంది.
దేశంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల తెలంగాణలో ఇద్దరు వ్యక్తులు కూడా మరణించారు. వాళ్లకి వైద్య పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ అని తేలింది.
సమాజ్‌వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య మరోసారి హిందుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఇటీవల జరిగిన బహుజన్ సమాజ్ హక్కుల సదస్సును ఉద్దేశించి మౌర్య వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేడు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై మొదటిసారి ప్రధానితో భేటీ కానున్నారు.
ఈ రోజు తెల్లవారుజామున లడఖ్, జమ్మూకశ్మీర్‌లో స్వల్పంగా భూమి కంపించింది. ప్రజలు భయభ్రాంతులకు గురై వెంటనే ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ తన నివాసంలో క్రైస్తవ సమాజానికి చెందిన వారితో సమావేశమయ్యారు. కమ్యూనిటీ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీమాట్లాడుతూ, క్రైస్తవ సమాజంతో తనకు సన్నిహిత సంబంధం ఉందన్నారు.
రైతులు రుణ మాఫీకి సంబంధించి కర్ణాటక మంత్రి శివానంద పాటిల్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ రైతులు ఆత్మహత్యలకు పాల్పడినందుకు ఇచ్చే నష్టపరిహారం విషయంలో కూడా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
గురుగ్రామ్‌లో ఆలయ గోడ కూలడంతో పెను ప్రమాదం సంభవించింది. గోడ కూలిపోవడంతో ఐదుగురు కూలీలు శిథిలాల కింద కూరుకుపోయారు. కూలీలను వెలికితీసే పనులు కొనసాగుతున్నాయని చెబుతున్నారు.