ఓ వ్యక్తి బ్లింకిట్ లో ఈ ఏడాదంతా కలిసి 9,940 కండోమ్స్ ఆర్డర్ పెడితే మరో వ్యక్తి 38 అండర్ వేర్లను ఒకే నెలలో ఆర్డర్ చేసుకున్నాడు. ఇలాంటి మరికొన్ని ఆర్డర్ల గురించి బ్లింకిట్ తెలియజేసింది.
పొరుగు దేశమైన మయన్మార్‌లో కొంతకాలం నుంచి మిలిటరీ పాలనను వ్యతిరేకిస్తూ సాయుధ తిరుగుబాటు జరుగుతోంది. ఈక్రమంలో తాజాగా 151 మంది మయన్మార్ సైనికులు అక్కడినుంచి పారిపోయి మిజోరంలోకి ప్రవేశించారు.
ఇండోనేషియాలోని అచే ప్రావిన్స్‌లో శనివారం భారీ భూకంపం సంభవించింది. ఈ బలమైన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైంది. అయితే ఈ ప్రకంపనల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందా అనే వివరాలు ఇంకా తెలియరాలేదు.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేది కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలలో ఒకటి. ఈ పథకం కింద, మోడీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ. 2,000 చొప్పున మూడు విడతలు అంటే మొత్తం రూ. 6,000 కోట్ల మంది రైతుల ఖాతాలకు బదిలీ చేస్తుంది.
శ్రీరాముడి నగరమైన అయోధ్యకు రూ.15 వేల కోట్ల విలువైన బహుమతిని మోడీ నేడు ఇచ్చారు. దీంతో పాటు హిందూ పుణ్యక్షేత్రాలను మాత్రమే అభివృద్ధి చేస్తున్నారని ఆరోపిస్తున్న వారికి ప్రధాని శనివారం ధీటైన సమాధానమిచ్చారు.
విమానాన్ని ట్రక్కుపై తీసుకెళ్తుండగా ఒక బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది. దాంతో జనాలు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. రోడ్డు మీద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
వచ్చే ఐదేళ్లలో 50 శాటిలైట్లను ప్రయోగించనున్నట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. మరిన్ని ప్రయోగాలను 2024లో చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా బీహార్ సీఎం నితీశ్ కుమార్ నియమితులయ్యారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. నితీష్ కుమార్‌ను అధ్యక్షుడిగా పార్టీ అధినేత లాలన్‌సింగ్ ప్రకటించారు.