మణిపూర్‌లో కుకి, నాగ తెగలకు సంబంధించిన గొడవలు ఇంకా చల్లారలేదు. ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం మళ్లీ హింసను కొనసాగిస్తోంది. ఆకస్మికదాడిలో పోలీసులు, బీఎస్ఎఫ్ అధికారి గాయపడ్డారు.
భారతదేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు అనేక సబ్ వేరియంట్ JN.1 కేసులు నమోదయ్యాయి. అయితే, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటాలో సోమవారం కరోనా కేసులలో కొంచెం తగ్గుదల కనిపించింది.
దేశవ్యాప్తంగా ట్రాన్స్‌పోర్టర్లు, ట్రక్కు డ్రైవర్లు సమ్మెలో ఉన్నారు. వివిధ యూనియన్‌లకు చెందిన ప్రజలు నిరంతరం చక్కా జామ్ కోసం విజ్ఞప్తి చేస్తున్నారు.
2024 సంవత్సరం ప్రారంభమైంది. ఈ సందర్భంగా గుజరాత్ ఈ ఏడాదికి ఘన స్వాగతం పలికింది. ఈరోజు గుజరాత్‌లోని 108 ప్రదేశాలలో భారీ సంఖ్యలో ప్రజలు ఏకకాలంలో సూర్య నమస్కారం చేశారు.
అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత క్లిష్టమైన కృష్ణబిలాల అధ్యయనమే లక్ష్యంగా పీఎస్‌ఎల్వీ-సీ58 రాకెట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతంగా ప్రయోగించింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించింది.
ఈ రోజు తెల్లవారుజామున మహారాష్ట్రలోని ఓ గ్లవ్స్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. దీంతో అక్కడే నిద్రిస్తున్న ఆరుగురు వ్యక్తులు సజీవదహనం అయ్యారు.
అయోధ్య రామమందిర నిర్మాణానికి విరాళాల పేరిట కొందరు కేటుగాళ్లు భక్తులను మోసం చేస్తున్నారు. భక్తులు ఇలాంటి స్కామర్లకు దూరంగా ఉండాలని ఓ వ్యక్తి సోషల్ మీడియా ద్వారా సూచించారు.
భారత ప్రభుత్వం తన ప్రతిభకు గుర్తింపుగా అందించిన అర్జున, ఖేల్‌రత్న అవార్డులను తిరిగి ఇచ్చేస్తానని భారత మహిళ రెజ్లర్ వినేష్ ఫోగట్ ప్రధాని మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. కొత్త సంవత్సరం తొలిరోజే మరో రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైందని ఇస్రో వెల్లడించింది.
మధ్యప్రదేశ్ లో మరోసారి భూమి కంపించింది. డిసెంబర్ 31 ఆదివారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. ఎంపీ సింగ్రౌలిలో వారం వ్యవధిలో రెండోసారి భూకంపం సంభవించింది.
బీహార్‌లో విమానం వంతెన కింద ఇరుక్కుపోయిన వార్త మరువకముందే మరో విచిత్రమైన యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు భాగల్‌పూర్‌లో రైలు బోగీతో వెళ్తున్న ట్రక్కు రైలింగ్‌ను ఢీకొట్టింది.
గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 841 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4,309కి చేరింది.
కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో ముంబై నగరానికి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. నగరంలోని పలుచోట్ల బాంబు దాడులు జరుగుతాయని గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూంకి కాల్ చేసి బెదిరించాడు.
మన్ కీ బాత్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఏడాది జరిగిన సంఘటలను గురించి మోదీ మాట్లాడారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ 2024 జనవరి 1వ తేదిన మరో రాకెట్ ను అంతరిక్షంలోకి ప్రయోగించనుంది. ఈ మేరకు సోమవారం రాకెట్ ప్రయోగానికి అన్నీ సిద్ధం చేసినట్లు ఇస్రో వెల్లడించింది.