Fire Accident: మహారాష్ట్రలోని ఓ గ్లవ్స్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున ఫ్యాక్టరీ మూసి ఉన్న సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో అక్కడే నిద్రిస్తున్న ఆరుగురు వ్యక్తులు సజీవదహనం అయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందుకుని ఘటన స్థలానికి చేరుకునే లోపే మంటలు పూర్తిగా వ్యాపించాయి. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీ లోపల 10-15 మంది ఉన్నారని బాధితులు తెలిపారు. మిగిలిన క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.