»Ayodhya Ram Mandhir Scammers Cheating Devotees With Qr Code
Ayodhya Ram Mandhir: క్యూఆర్ కోడ్‌తో భక్తులను మోసం చేస్తున్న స్కామర్లు!
అయోధ్య రామమందిర నిర్మాణానికి విరాళాల పేరిట కొందరు కేటుగాళ్లు భక్తులను మోసం చేస్తున్నారు. భక్తులు ఇలాంటి స్కామర్లకు దూరంగా ఉండాలని ఓ వ్యక్తి సోషల్ మీడియా ద్వారా సూచించారు.
Ayodhya Ram Mandhir: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం పనులు చకచకా పూర్తి చేస్తున్నారు. జనవరి 22న రామమందిరం ప్రారంభం కాబోతుంది. అయితే కొందరు కేటుగాళ్లు చందాల దందాతో భక్తులను మోసగిస్తున్నారు. మందిరం పేరుతో విరాళాలు వసూలు చేస్తున్నారు. ఈ ముఠాపై చర్చలు చేపట్టాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. అలాగే ఈ స్కాం ఉచ్చులో పడవద్దని భక్తులను సోషల్ మీడియా ద్వారా హెచ్చరించారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర అయోధ్య, ఉత్తరప్రదేశ్ పేరుతో సోషల్ మీడియాలో నకిలీ పేజ్ క్రియేట్ చేశారు. రామ మందిర నిర్మాణం కోసం క్యూఆర్ కోడ్ ద్వారా విరాళాలు అందచేయాలని కేటుగాళ్లు భక్తులను మోసం చేస్తున్నారని తెలిపారు. ఈ స్కాంపై హోంమంత్రిత్వ శాఖతో పాటు ఢిల్లీ, యూపీలో పోలీస్ విభాగాలకు ఫిర్యాదు కూడా చేశారు.
सावधान..!! श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र के नाम से फर्जी आईडी बना कर कुछ लोग पैसा ठगी का प्रयास कर रहे हैं। @HMOIndia@CPDelhi@dgpup@Uppolice को ऐसे लोगों के विरूद्ध विलम्ब कार्यवाही करनी चहिए। @ShriRamTeerth has not authorised any body to collect funds for this occasion. pic.twitter.com/YHhgTBXEKi
అయోధ్యకు చెందిన ఓ వీహెచ్‌పీ సభ్యుడికి స్కామ్‌స్టర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మీకు తోచినంత విరాళం ఇవ్వాలని కోరారు. మీరు పేరును డైరీలో రాసి మందిర నిర్మాణం పూర్తికాగానే అయోధ్యకు ఆహ్వానిస్తామని తెలిపారు. తను అయోధ్య నుంచి మాట్లాడుతున్నానని చెప్పారట. ఇలా రామమందిర పేరుతో ప్రజలను మోసగిస్తున్నారని.. అప్రమత్తంగా ఉండాలని సోషల్ మీడియా ద్వారా ఓ వ్యక్తి భక్తులను సూచిస్తున్నారు.