గత 24 గంటల్లో దేశంలో 761 మంది కరోనా బారిన పడ్డారు. మరో 12 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌గా ఉన్న కరోనా కేసుల సంఖ్య 4334. కేరళలో గరిష్టంగా 5 మంది కరోనా కారణంగా మరణించగా, కర్ణాటకలో నలుగురు వ్యక్తులు మరణించారు.మహారాష్ట్రలో ఇద్దరు, యూపీలో ఒకరు మరణించారు.
జమ్మూకశ్మీర్‌లో ఇవాళ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.9గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) తెలిపింది. NCS ప్రకారం, భూకంపం మధ్యాహ్నం 12.38 గంటలకు 5 కి.మీ లోతులో సంభవించింది.
జార్ఖండ్ మైనింగ్ కుంభకోణం కేసులో సీఎం హేమంత్ సోరెన్ తర్వాత ఆయన సన్నిహితులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు కఠిన చర్యలు ప్రారంభించింది.
కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సక్సెస్ కావడంతో ఇప్పుడు రెండో విడుత యాత్రకు సిద్ధం అయ్యారు. జనవరి 14 నుంచి మార్చి 30 వరకు చేపట్టే ఈ యాత్ర పేరును, ఇతర వివరాలను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ వెల్లడించారు.
ఎన్సీపీ నేత జితేంద్ర అవద్ శ్రీరామునిపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ నెల 22న అయోధ్య రామమందిరం ప్రారంభించనున్నారు. అయితే జనవరి 22న డ్రై డేగా, మాంసాహార నిషేధ దినోత్సవంగా ప్రకటించాలని జితేంద్ర డిమాండ్ చేశారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కి కూడా బెదిరింపులు వచ్చాయి. అయోధ్యలో నిర్మించిన రామమందిరంతో పాటు యోగి ఆదిత్యనాథ్‌ను పేల్చివేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి.
లోక్‌సభ ఎన్నికల తేదీలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం జనవరి 7 నుంచి జనవరి 10 వరకు రాష్ట్రాల్లో పర్యటించనుంది. ముందుగా ఆంధ్రప్రదేశ్, ఇతర దక్షిణాది రాష్ట్రాలను సందర్శిస్తారని తెలుస్తోంది.
జైలులో కులం ఆధారంగా వివక్ష చూపుతున్నారనే ఆరోపణలపై సుప్రీంకోర్టు... కేంద్రంతో పాటు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా 11 రాష్ట్రాల నుంచి సమాధానాలు కోరింది.
జపాన్‌లో వరుస భూకంపాలు ఆ దేశ ప్రజలను వణికిస్తున్నాయి. ఇటీవల రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.5గా నమోదైంది. భూమి ఏకంగా 18గంటల్లో 155సార్లు కంపించింది.
ప్రపంచంలో నిత్యం ఏదో ఒక మూల మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు భౌతికంగా మాత్రమే దాడులు జరిగేవి. టెక్నాలజీ పెరగడంతో ఇప్పుడు ఆన్ లైన్లో కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి.
మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ ఇప్పటికి మూడుసార్లు నోటీసులు ఇచ్చింది. ఈడీ విచారణకు మరోసారి కేజ్రీవాల్ గైర్హాజరయ్యారు.
కరోనా కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. మొత్తం దేశంలో ఎన్ని కేసులు నమోదు అయ్యాయో ఇండియన్ సార్స్-కోవ్2 జీనోమిక్స్ కన్సార్టియం (INSACOG) వెల్లడించింది.
మణిపూర్లో హింస ఆగడం లేదు. రాష్ట్రంలోని తెంగ్నౌపాల్ జిల్లాలోని మోరే నగరంలో మరోసారి హింస వ్యాపించింది. మంగళవారం ఇక్కడ భద్రతా బలగాలకు, అనుమానిత ఉగ్రవాదులకు మధ్య మళ్లీ కాల్పులు జరిగాయి.
యూపీ, గుజరాత్‌లోని పాఠశాలల్లో తన లింగాన్ని వెల్లడించిన తర్వాత సర్వీసును రద్దు చేసిన ట్రాన్స్‌జెండర్ టీచర్ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. తన లింగ నిర్ధారణ వెల్లడికావడంతో సర్వీసు నుంచి తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తమిళనాడులోని తిరుచ్చిరాపల్లిలో ఉన్న భారతీదాసన్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పొల్గొన్న మోదీ యువతను ఉద్దేశించి మాట్లాడారు.