కేంద్ర ప్రభుత్వం రెండు హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. వందే భారత్ స్లీపర్ వెర్షన్‌గా వస్తున్న ఈ హైస్పీడ్ రైళ్లను అమృత్ ఎక్స్‌ప్రెస్ పేరుతో ప్రారంభించనున్నారు.
ఒకవైపు దేశం మొత్తం నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు సిద్ధమవుతుండగా, మరోవైపు దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి.
మణిపూర్ గాయకుడు, గీత రచయిత అఖు చింగంగ్‌బామ్‌ను కొందరు దుండగులు తుపాకీతో కిడ్నాప్ చేశారు. మణిపూర్‌లో గత కొన్ని నెలలుగా మెయిటీ, కుకీ వర్గాల మధ్య హింస జరుగుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.
తమ వంశాన్ని నిలబెట్టుకునే హక్కు ఖైదీలకు ఉందని ఢిల్లీ హైకోర్టు తీర్పు నిచ్చింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ వ్యక్తి భార్య అభ్యర్థన మేరకు కోర్టు తీర్పునిచ్చింది.
సన్నబియ్యాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. భారత్ బ్రాండ్ రైస్ పేరుతో సన్న బిర్యాన్ని కేజీ 25 రూపాయలకే అందించేందుకు సిద్ధమైంది.
నౌకలో విధుల్లో ఉన్న నావికుడు అదృశ్యమయ్యారు. తుర్కియేలోని నౌకాశ్రయానికి వెళ్లే మార్గంలో నౌక నుంచి కనిపించకుండా పోయారు. ఆచూకీ లేదని నావికుడి కుటుంబం ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని ఆశ్రయించింది.
కన్నడలోనే సైన్ బోర్డులు ఉండాలని నిరసన తెలిపిన కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలను అరెస్టు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వంపై కన్నడ అనుకూల సంస్థలు మండిపడ్డాయి.
జనవరి 22న అయోధ్య రామాలయంలో రాముడి విగ్రహా ప్రాణ ప్రతిష్టకు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈక్రమంలో అయోధ్యకు 620 కిలోల బరువున్న గంట కూడా చేరుకుంది.
వచ్చే ఏడాది జనవరి 22న అయోధ్య రామమందిరంలో రామ్ లల్లాకు పట్టాభిషేకం జరుగనుంది. ఆ సమయంలో గర్భగుడిలో కేవలం 5 మంది మాత్రమే ఉంటారు.
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి కష్టాలు పెరుగుతున్నాయి. హర్యానాలోని ఫరీదాబాద్‌లో భూమి కొనుగోలుకు సంబంధించిన కేసులో ప్రియాంక గాంధీ పేరును ఈడీ చార్జ్ షీట్‌లో చేర్చింది.
దేశంలో మరోసారి కరోనా కలకలం రేపింది. బుధవారం ఒక్కరోజే 702 కోవిడ్ 19 కేసులు నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సంఖ్యతో దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా ఇన్‌ఫెక్షన్ కేసుల సంఖ్య 4,097కి పెరిగింది.
దేశంలో పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు రావడంతో తీవ్ర కలకలం రేపింది. ఈ బాంబు బెదిరింపులు దేశ రాజధాని ఢిల్లీ సహా 7 విమానాశ్రయాలకు వచ్చాయి.
అంతర్జాతీయ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, లష్కరే తోయిబా ఫౌండర్ హఫీజ్ ముహమ్మద్ సయీద్‌ను భారత్‌కు అప్పగించాలని పాకిస్థాన్‌కు అధికారకి అభ్యర్థన అందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రామ మందిర ప్రారంభోత్సవానికి 3 లక్షల మందికి పైగా ప్రజలు అయోధ్యకు చేరుకుంటారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రారంభోత్సవ వేడుకలో నెట్‌వర్క్ సమస్య తలెత్తే అవకాశం ఉంది. దీంతో టెలికాం కంపెనీల నెట్‌వర్క్ సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని టెలికమ్యూనికేషన్స్ శాఖ ఆదేశించింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన పాపులర్ ఓపెన్ఏఐ టూల్ చాట్‌జీపీటీకి పోటీగా జియో నుంచి సరికొత్త ఏఐ ప్రొగ్రామ్ ‘భారత్ జీపీటీ’ పేరుతో అందుబాటులోకి రానుందని ఆకాశ్ అంబానీ తెలిపారు.