»Delhi Prisoners Have Right To Maintain Their Lineage
Delhi: తమ వంశాన్ని నిలబెట్టుకునే హక్కు ఖైదీలకు ఉంటుంది
తమ వంశాన్ని నిలబెట్టుకునే హక్కు ఖైదీలకు ఉందని ఢిల్లీ హైకోర్టు తీర్పు నిచ్చింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ వ్యక్తి భార్య అభ్యర్థన మేరకు కోర్టు తీర్పునిచ్చింది.
Delhi: జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు కూడా సంతానోత్పత్తి హక్కు ఉంటుందని ఢిల్లీ హైకోర్టు తీర్పు నిచ్చింది. తమ వంశాన్ని నిలబెట్టుకునే హక్కు ఖైదీలకు ఉందని తెలిపింది. ఓ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తికి నాలుగు వారాల పాటు పెరోల్ మంజూరు చేసింది. తన భర్త ద్వారా సంతానాన్ని పొందే అవకాశం కల్పించాలన్న అతని భార్య అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
ఆ భార్య వయస్సు 38 ఏళ్లు, అతని భర్త వయస్సు 41 ఏళ్లు.. శిక్షా కాలం పూర్తయ్యేసరికి ఆ దంపతులకు సంతానం పొందే వయస్సు దాటిపోతుందని హైకోర్టు తెలిపింది. దాంపత్య జీవనం కోసం అనుమతివ్వడం లేదని, వంశాన్ని నిలబెట్టుకోవాలన్న భార్య ఆకాంక్షను, హక్కును గౌరవిస్తున్నట్లు జస్టిస్ స్వర్ణ కాంతశర్మ వెల్లడించారు. జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తి ఇప్పటికే 14ఏళ్లుగా జైలులో ఉన్నారని న్యాయమూర్తి తెలిపారు. పెరోల్ కోసం రూ.20 వేలకు వ్యక్తిగత బాండును సమర్పించడం సహా ఒకరి షూరిటీ ఇవ్వాలని కండీషన్ పెట్టారు.