అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత క్లిష్టమైన కృష్ణబిలాల అధ్యయనమే లక్ష్యంగా పీఎస్ఎల్వీ-సీ58 రాకెట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతంగా ప్రయోగించింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించింది.
XPoSat: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించింది. అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత క్లిష్టమైన కృష్ణబిలాల అధ్యయనమే లక్ష్యంగా పీఎస్ఎల్వీ-సీ58 రాకెట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతంగా ప్రయోగించింది. ఇస్రోకి అత్యంత నమ్మకమైన వాహననౌక ద్వారా ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహంతో ఈ రోజు ఉదయం 9:10 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. 25 గంటల కౌంట్‌డౌన్ అనంతరం షార్‌లోని ఈ ప్రయోగం విజయవంతమైంది. ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహంతో పాటు మరో పది శాటిలైట్లను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇందులో మన దేశానికి చెందిన 480 కిలోల బరువు గల XPoSatను అంతరిక్షంలోకి పంపారు. ప్రయోగం తర్వాత 21 నిమిషాలకు ఎక్స్‌పోశాట్ నిర్ణీత కక్ష్యలోకి చేరుకుంది.
PSLV-C58/XPoSat Mission: Lift-off normal 🙂
🛰️XPoSat satellite is launched successfully.
🚀PSLV-C58 vehicle placed the satellite precisely into the intended orbit of 650 km with 6-degree inclination🎯.
బ్లాక్‌హోల్ ఎక్స్ రే బైనరీలు, యాక్టివ్ గెలాక్సీ న్యూక్లియోలు, న్యూట్రాన్ స్టార్స్, నాన్ థర్మల్ సూపర్ నోవా అవశేషాలతో సహా విశ్వంలో గుర్తించబడిన 50 ప్రకాశవంతమైన మూలాలను ఎక్స్‌పోశాట్ అధ్యయనం చేయనుంది. ఈ ఉపగ్రహాన్ని 500-700 కిలోమీటర్ల దూరంలో వృత్తాకార దిగువ భూ కక్ష్యలో ప్రవేశపెట్టారు. అయిదేళ్ల పాటు సేవలందించనున్న ఎక్స్‌పోశాట్‌లో రెండు పేలోడ్స్ ఉన్నాయి. పాలీఎక్స్, ఎక్స్-రే స్పెక్ట్రోసోపీ, టైమింగ్‌ను అమర్చారు. పాలీఎక్స్‌ను రామన్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ తయారు చేయగా.. ఎక్స్‌పెక్ట్‌ను యూఆర్ రావు శాటిలైట్ సెంటర్‌కు చెందిన స్పేస్ ఆస్ట్రానమీ గ్రూప్ రూపొందించింది. అమెరికా తర్వాత ఇలాంటి ప్రయోగం చేపట్టిన దేశంగా భారత్ నిలిచింది.