Sanjay Raut: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి బీజేపీని టార్గెట్ చేశారు. రాముడి పేరుతో చాలా రాజకీయాలు జరుగుతున్నాయని బీజేపీని దృష్టిలో ఉంచుకుని అన్నారు. ఏదైనా అంశం మిగిలి ఉందంటే.. అది రాముడిని తమ అభ్యర్థిగా బీజేపీ త్వరలో ప్రకటించనుందంటూ ఎద్దేవా చేశారు. అయోధ్య లేదంటే మరే ఏదైనా ప్రాంతం నుంచి రాముడిని తమ అభ్యర్థిగా ప్రకటిస్తారని బీజేపీని విమర్శించారు. అలాగే కాంగ్రెస్ను జీరో అనడంపై కూడా క్లారిటీ ఇచ్చారు.
తాను ఎప్పుడు కాంగ్రెస్ను జీరో అనలేదని సంజయ్ రౌత్ చెప్పారు. సున్నా నుంచి కాంగ్రెస్ ప్రారంభమవుతుందని చెప్పానని.. కాంగ్రెస్ జీరో అని ఎప్పుడు చెప్పలేదన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఒక్క కాంగ్రెస్ ఎంపీ కూడా లేరని.. తమకు 18 మంది ఎంపీలు ఉన్నారన్నారు. ప్రస్తుతం మాకు ఆరుగురు ఎంపీలు మాత్రమే ఉన్నారని తెలిపారు. మా కూటమి కాంగ్రెస్తో ఉందని తెలిపారు.