»Farooq Abdullah If There Is A War The People Of Kashmir Will Lose
Farooq Abdullah: యుద్ధం జరిగితే నష్టపోయేది కశ్మీర్ ప్రజలే!
జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్థాన్ దేశాలు చర్చల ద్వారా కశ్మీర్ అంశంపై ఒక పరిష్కారానికి రావడం ఉత్తమమని సూచించారు. ఒకవేళ అలా జరగకపోతే కశ్మీర్ పరిస్థితి గాజాలా మారుతుందని వ్యాఖ్యనించారు.
Farooq Abdullah: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌కు ఒకవైపు పాకిస్థాన్, మరోవైపు చైనా ఉన్నాయని ఒకవేళ యుద్ధం జరిగితే తీవ్రంగా నష్టపోయేది కశ్మీర్ ప్రజలేనని ఫరూఖ్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలే క్షేమకరమని తెలిపారు. మనం స్నేహితులను మార్చగలమేమో గానీ ఇరుగుపొరుగును మార్చలేం అని గతంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అన్న మాటలు అబ్దుల్లా గుర్తు చేశారు. భారత్, పాకిస్థాన్ దేశాలు చర్చల ద్వారా కశ్మీర్ అంశంపై ఒక పరిష్కారానికి రావడం ఉత్తమమని సూచించారు. ఒకవేళ అలా జరగకపోతే కశ్మీర్ పరిస్థితి గాజాలా మారుతుందని వ్యాఖ్యనించారు.
#WATCH | Kulgam, J&K: Former CM of Jammu and Kashmir, Farooq Abdullah says"…We were a part of Bharat Jodo Yatra and will be a part of Bharat Nyay Yatra…There can be a situation in Kashmir (like that in Gaza) if India and Pakistan do not go for dialogue… On one side we have… pic.twitter.com/RVKSUqKQXM