E.G: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని తూర్పుగోదావరి జిల్లా సీపీఎం కార్యవర్గ సభ్యులు జువ్వల రాంబాబు డిమాండ్ చేశారు. మంగళవారం నిడదవోలు మండలం సింగవరం గ్రామ సచివాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పేద ప్రజల ఉపాధిని దెబ్బకొట్టే VBG రామ్ జీ చట్టాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.