»Shivanand Patil Farmers Want Drought For Loan Waiver
Shivanand patil: రుణ మాఫీ కోసం రైతులు కరువు కోరుకుంటున్నారు
రైతులు రుణ మాఫీకి సంబంధించి కర్ణాటక మంత్రి శివానంద పాటిల్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ రైతులు ఆత్మహత్యలకు పాల్పడినందుకు ఇచ్చే నష్టపరిహారం విషయంలో కూడా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
Shivanand patil: కర్ణాటక మంత్రి శివానంద పాటిల్ రైతులపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బెళగావిలో జరిగిన ఓ సమావేశంలో రైతులు రుణ మాఫీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. రుణాలను ప్రభుత్వం మాఫీ చేసేందుకు రైతులు ఏటా కరువును కోరుకుంటున్నారన్నారు. రైతులకు కరెంట్, నీరు ఉచితంగా లభిస్తున్నాయి. ఎంతో మంది ముఖ్యమంత్రులు రాష్ట్రంలో వ్యవసాయరంగ విస్తరణకు సహకారం అందించారు. అయిన సరే రైతులు ఏటా కరువును కోరుకుంటున్నారని అన్నారు.
ఎందుకంటే దీని వల్ల ప్రభుత్వం వారి రుణాలను మాఫీ చేస్తుందని భావిస్తున్నారని అన్నారు. కానీ, రైతులు అలా కోరుకోవడం సరికాదని పాటిల్ వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ మండిపడింది. పాటిల్‌ను వెంటనే మంత్రి వర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. సీఎం సిద్ధరామయ్య కేబినెట్ అంతా అజ్ఞానులతో నిండిపోయిందని విమర్శించింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అవమానించిందని.. రైతులకు వ్యతిరేకమని అన్నది. సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేసింది.