»Israeli Embassy Was The Target Of The Explosion In Delhi
Israeli Embassy: ఢిల్లీలో పేలుడు.. ఇజ్రాయెల్ ఎంబసీనే టార్గెట్
ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీపై బాంబు దాడి తీవ్ర కలకలం రేపింది. సీసీ కెమెరా ఆధారంగా ఇద్దరు అనుమానితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తమ దేశాన్ని గుర్తించేలా ఏది ఒంటిపై ప్రదర్శించొద్దని జాతీయ భద్రతా మండలి స్పందించింది.
Israeli Embassy was the target of the explosion in Delhi
Israeli Embassy: ఢిల్లీ(Delhi)లోని ఇజ్రాయెల్(Israeli) ఎంబసీ(Embassy) సమీపంలో నిన్న సాయంత్రం పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన కీలక విషయాలను క్లూ టీమ్స్ సేకరించాయి. సీసీ కెమెరా ఆధారంగా అనుమానితులకు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ పేలుడు ప్రమాదంలో సిబ్బందికి ఏం కాలేదని పోలీసులు తెలిపారు. అయితే ఇజ్రాయెల్ రాయబారిని తిడుతూ ఒక లెటర్ దొరికింది. దాంతో ఈ పేలుడు కచ్చిత ఉద్దేశం వీరే అని ఇజ్రాయెల్‌కు చెందిన ఇతర సంస్థల దగ్గర సెక్యురిటీని పెంచారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి ఢిల్లీ పోలీసులతో సహా ఎన్ఐఏ బృందం రంగంలోకి దిగింది.
దీనిపై ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మండలి స్పందించి.. ఇది ఉగ్రదాడిగా అనుమానపడింది. తమ దేశ పౌరుల పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ వాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. షాపింగ్ మాల్స్, థియేటర్లు, రెస్టారెంట్లకు వెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలని, తాము ఇజ్రాయెల్‌కు చెందిన వాళ్లు అని గుర్తించే విధంగా ఏది బయటకు ప్రదర్శించొద్దు అని హెచ్చిరించింది. అలాగే తమ ప్రయాణాలను సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని తెలిపింది. గతంలో కూడా ఇజ్రాయెల్ రాయబార సంస్థపై దాడి జరిగింది. 2012లో ఎంబసీలోని భద్రతా సిబ్బంది భార్య కారుపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఆమె గాయపడ్డారు. 2021లో ఎంబసీ బయట బాంబు దాడి జరిగింది. ఆ ఘటనలో ఎలాంటి నష్టం కలుగలేదు.