భారత అంతరిక్ష సంస్థ ఇస్రో సూర్యునిపై పరిశోధనలు చేయడానికి ఆదిత్య ఎల్1 మిషన్‌ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఆ మిషన్ త్వరలోనే ఆఖరి స్టేజ్‌కు చేరుకోనుంది. సూర్యునిపై అధ్యయనం చేసేందుకు ప్రయోగించిన ఆదిత్య ఎల్1 మిషన్ జనవరి 6వ తేదిన తన గమ్యస్థానానికి చేరుకోనుందని ఇస్రో వెల్లడించింది. ఆదిత్య ఎల్1 మిషన్ ఆ రోజున సూర్యుని వద్ద ఉన్న పాయింట్1 వద్దకు ప్రవేశిస్తుందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించారు.
"Aditya L1 will enter L1 point on January 6. That is what is expected; exact time will be announced at the appropriate time," says ISRO Chairman S Somanath#AdityaL1#ISRO pic.twitter.com/zlOBhBAkXz
ఆ రోజున దానికి సంబంధించిన కచ్చితమైన వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. ఈ స్పేస్‌క్రాఫ్ట్ ఎల్-1 పాయింట్‌కు చేరుకున్న తర్వాత మరోసారి ఇంజిన్‌ను మండిస్తామని సోమనాథ్ చెప్పారు. తర్వాత ఈ వ్యోమనౌక ఎల్-1 కేంద్రంలో స్థిరపడుతుందని, అది విజయవంతంగా ఆ పాయింట్ వద్దకు చేరుకున్న తర్వాత అక్కడే కక్ష్యలో తిరుగుతూ ఉంటుందని వివరించారు. ఐదేళ్లపాటు భారత్ సహా ప్రపంచ దేశాలకు ఉపకరించేందు ఆదిత్య ఎల్1 సేకరించనున్న సమాచారం సూర్యుడిలో వచ్చే మార్పులు, అవి మానవ జీవనంపై చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని సోమనాథ్ వెల్లడించారు.