640 new corona cases have been registered in the india december 22nd 2023
దేశంలో శుక్రవారం కరోనా యాక్టివ్ కేసులు పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 640 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం క్రియాశీల కేసులు 2,669 నుంచి 2,997 కి పెరిగాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా పరీక్షల సంఖ్య ఇప్పుడు 4.50 కోట్ల(4,50,07,212)కు చేరగా, మరణాల సంఖ్య 5,33,328కి చేరుకుంది. మరోవైపు దేశవ్యాప్తంగా కోవిడ్ రికవరీ రేటు 98.81% వద్ద ఉండగా.. 4,44,70,887 మంది వ్యక్తులు ఈ వ్యాధి నుంచి ఇప్పటికే కోలుకున్నారు. ఇక కోవిడ్ మరణాల రేటు 1.19%గా ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 220.67 కోట్ల డోస్‌ల కోవిడ్-19 వ్యాక్సిన్లను పంపిణీ చేశారు.
శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన డేటా ప్రకారం కేరళలో గత 24 గంటల్లో 265 COVID-19 కేసులు, ఒక మరణం నమోదైంది. ఇక గురువారం 594 కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి, క్రియాశీల కేసుల సంఖ్య 2,311 నుండి 2,669కి పెరిగింది. ఈ రోజు ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 328 కొత్త ఇన్ఫెక్షన్లలో, కేరళలో 265 నమోదయ్యాయి. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. బయటకు వెళ్లే సమయంలో మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు.
ఇక తెలంగాణలోని నిలోఫర్ పిల్లల ఆస్పత్రిలో కూడా 14 నెలల చిన్నారికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతోపాటు బులంద్‌షహర్ జిల్లాలో, జహంగీరాబాద్ ప్రాంతంలో 17 ఏళ్ల బాలుడు COVID-19 కు పాజిటివ్ అని తేలింది. అతను ఒంటరిగా ఉన్నప్పటికీ, అతని కుటుంబ సభ్యులు, క్లినిక్ సిబ్బందికి పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చింది. JN-1 సబ్-వేరియంట్ నిర్ధారణ పెండింగ్‌లో ఉంది. జీనోమ్ సీక్వెన్సింగ్ రిపోర్ట్ కోసం వేచి చూస్తున్నారు. అదే సమయంలో లక్నో ఒక వృద్ధ మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ హామీ ఇచ్చారు. ఇది కొత్త వేరియంట్ కాదని, ఇది సబ్ వేరియంట్ అని ఉద్ఘాటించారు.