»Ex Assistant Asta Jonasson Sexual Allegations Against Hollywood Actor Vin Diesel
Vin diesel: హాలీవుడ్ నటుడిపై మాజీ అసిస్టెంట్ లైంగిక ఆరోపణలు
ప్రముఖ బాలీవుడ్ నటుడు విన్ డీజిల్ పై అతని మాజీ అసిస్టెంట్ అస్టా జోనాసన్ లైంగిక ఆరోపణలు చేశారు. "ఫాస్ట్ ఫైవ్" చిత్రంలో పని చేస్తున్నప్పుడు ఈ నటుడు అట్లాంటా హోటల్ గదిలో తనపై దాడి చేశాడని ఆరోపించారు.
Ex assistant Asta Jonasson sexual allegations against Hollywood actor vin diesel
‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్ బాలీవుడ్ నటుడు విన్ డీజిల్(vin diesel)పై కేసు నమోదైంది. తన మాజీ అసిస్టెంట్ ఆస్టా జోనాసన్(Asta Jonasson )నుంచి ఇతను లైంగిక ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. గురువారం లాస్ ఏంజిల్స్‌లో ఈమే దాఖలు చేసిన దావా నేపథ్యంలో ఇది వెలుగులోకి వచ్చింది. 2010 చివరలో అట్లాంటాలోని ‘ఫాస్ట్ ఫైవ్’ సెట్లో పనిచేస్తున్నప్పుడు ఈ నటుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆస్టా జోనాసన్ తెలిపింది. ఆ తర్వాత కొన్ని గంటలకు ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపిస్తూ ఆమె విన్ డీజిల్‌పై దావా వేసింది. ఆమె తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం శాశ్వతమైన మార్పును సృష్టించడంలో సహాయపడుతుందని జోనాసన్ న్యాయవాది క్లైర్-లిస్ కుట్లే అన్నారు. ఇది ఇతర మహిళలకు ఎంతో దోహదం చేస్తుందన్నారు. ఈ క్రమంలో అనేక మంది మహిళలు పురుషులు నుంచి రక్షించబడతారని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Scripted news by the numbers. Vin Diesel accused of sexual battery.
12+21+2+0+2+3=40
Sexual Battery=173(40th prime).
News comes while Vin is 56 yrs old.
12+21+23=56
Mark Sinclair=56
Society of Jesus=56
251 days after Fast Five anniversary release
251(54th prime)
Vin Diesel=54 pic.twitter.com/TUt4N75pbf
తన దావాలో విన్ డీజిల్ తన హోటల్ సూట్లో ఉన్న క్రమంలో అనేక మంది మహిళలకు మత్తులో మునిగారని చెప్పారు. ఆ క్రమంలోనే ఒక రాత్రి డీజిల్ తనను బలవంతంగా పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడని జోనాసన్ ఆరోపించింది. ఆ క్రమంలో తాను లైంగిక వేధింపులకు సమ్మతించనట్లు చెప్పింది. అయినప్పటికీ తనపై బలవంతంగా అత్యాచారం చేశాడని ఆమె తెలిపింది. ఆ తర్వాత అతను ఆమె గది నుంచి వెళ్లిపోయినట్లు చెప్పింది. ప్రపంచంలో అత్యధిక క్రేజ్ ఉన్న నటుల్లో ఒకరికైన తనకు వ్యతిరేకంగా మాట్లాడటానికి భయపడి చాలా సంవత్సరాలు మౌనంగా ఉన్నానని ఆమె వెల్లడించింది.