»Onion Price Onion Price Hit Century Likely To Increase Further
Onion Price : సెంచరీ కొట్టిన ఉల్లి రేటు..మరింత పెరిగే అవకాశం
ఢిల్లీ ఎన్సీఆర్లో ఉల్లి ధర సెంచరీ కొట్టింది. ఆ ప్రాంతంలో ఉల్లి రిటైల్ ధర రూ.100కి చేరింది. రోజురోజుకూ పెరుగుతున్న ఆనియర్ ధరలు.. సామాన్యులకు అందేలా కనిపించడంలేదు.
ఢిల్లీ మార్కెట్లో ఉల్లి ధర (onion price)సెంచరీ కొట్టింది. ఆ ప్రాంతంలో ఉల్లి రిటైల్ ధర రూ.100కి చేరింది.హోల్‌సేల్ మార్కెట్లో దాదాపు రూ.80కి చేరింది. ఉల్లి ధర ఇంకా వేగంగా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. త్వరలో ఉల్లి రిటైల్ ధర రూ.150 దాటే అవకాశం ఉంది. ఇటీకాలంలో టమాటా రేటు(Tomato rate)భారీగా పెరిగాయి.అప్పుడు సామాన్యులు టామాట కొనలేక సబ్సిడీ కోసం క్యూ కట్టారు. ఇప్పుడు.. ఉల్లిగడ్డ కొండెక్కింది. రోజురోజుకూ రేటు పెరగడమే తప్ప.. కిందికి దిగిరానని అంటోంది. ఇలా నిత్యావసరమైన ఉల్లిగడ్డ ధర పెరగడం సామన్యులకు భారంగా మారుతోంది. ఒకప్పడు ఆనియన్ రేటు కేజి రూ.10 నుంచి రూ.20 మధ్యలో ఉండేది. ఇప్పుడు రూ.100 చేరువైంది.
వాతావరణ సంబంధిత కారణాలతో ఖరీఫ్ ఉల్లి నాట్లు ఆలస్యమైనట్లు సమాచారం.దీంతో ఉల్లి పంట దెబ్బతింది. దీంతో పాటు రాకపోకల్లో కూడా జాప్యం జరుగుతోంది. తాజాగా ఖరీఫ్ ఉల్లి రాకలో జాప్యం జరుగుతోంది. ఈ రాక ఇప్పటికి మార్కెట్లకు చేరి ఉండాల్సింది. రబీ ఉల్లి నిల్వ ఉన్న ఆనియన్ నిల్వలు కూడా అయిపోయాయి. ఖరీఫ్‌లో జాప్యం కారణంగా ఉల్లి సరఫరా అంతంత మాత్రంగానే ఉంది. హోల్‌సేల్, రిటైల్ మార్కెట్(Retail market)లలో ఉల్లి ధరలు పెరగడానికి ఇదే కారణం. తెలుగు రాష్ట్రాల్లోనూ ఉల్లి ధర కేజీ 70రూపాయలు దాటింటి. హైదరాబాద్ (Hyderabad) బహిరంగ మార్కెట్లో ఉల్లిగడ్డల ధరలు కిలో 70 రూపాయలకుపైగా పలుకుతోంది. దీంతో హోటళ్లు, పానిపూరి షాపుల్లో ఆనియన్ వడ్డింపులను పరిమితం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఉల్లిగడ్డల ధరలు 70 నుంచి 80 వరకు చేరుకున్నాయి.