»On Womens Day City Bus Travel Is Free For Women In Bengaluru
Bengaluru to provide free bus rides to women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women's Day) సందర్భంగా మహిళలకు బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్సుపోర్ట్ కార్పోరేషన్ (Bengaluru Metropolitan Transport Corporation-BMTC) అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women’s Day) సందర్భంగా మహిళలకు బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్సుపోర్ట్ కార్పోరేషన్ (Bengaluru Metropolitan Transport Corporation-BMTC) అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఈ రోజు బస్సులలో ప్రయాణించే మహిళలకు టికెట్ ఉండదని ప్రకటించింది. తద్వారా కర్ణాటక రాజధాని బెంగళూరులో (karnataka capital city Bengaluru) ట్రాన్సుపోర్ట్ కార్పోరేషన్ మహిళలకు (Women) ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం (Free bus rides for women) కల్పించింది. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బెంగళూరులో మహిళలు ఏ బస్సులోనైనా ఉచితంగా ప్రయాణించవచ్చని బీఎంటీసీ (BMTC) ప్రకటించింది. సాధారణ బస్సులతో పాటు, నగర పరిధిలోని ప్రీమియర్ ఏసీ బస్సుల్లోనూ ఉచితంగా వెళ్లవచ్చునని తెలిపింది. కెంపె గౌడ నుండి ఎయిర్ పోర్టు వరకు నడిపే వజ్ర, వాయు వజ్ర సర్వీసుల్లో కూడా టిక్కెట్ లేకుండానే ప్రయాణం చేయవచ్చునని స్పష్టం చేసింది.
మహిళలు ప్రయివేటు ట్రాన్స్పోర్ట్ సర్వీస్ వాడే బదులు, పబ్లిక్ ట్రాన్స్పోర్టు సర్వీసును ఉపయోగించుకోవాల్సిందిగా బీఎంటీసీ అధికారులు సూచిస్తున్నారు. దీనివల్ల ట్రాఫిక్ తగ్గుతుందని, ఇది సురక్షితమైన ప్రయాణమని చెబుతున్నారు. నగరంలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా మెరుగవుతుందని అభిప్రాయపడింది. గతంలో బెంగళూరులో ఒక్కసారి మాత్రమే బస్సుల్లో బీఎంటీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. బీఎంటీసీ ఏర్పడి 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా గత ఏడాది ఆగస్ట్ 15న ఉచిత బస్సు ప్రయాణ అవకాశం కల్పించింది. ఇప్పుడు మరోసారి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ప్రస్తుతం బీఎంటీసీ (BMTC)కి 6600 బస్సులు ఉన్నాయి. 5567 బస్సులను రన్ చేస్తున్నాయి. ప్రతి రోజు ఈ బస్సులు 10.84 లక్షల కిలో మీటర్లు ప్రయాణిస్తూ, 29 లక్షల మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి.
మహిళా దినోత్సవం సందర్భంగా రాజస్థాన్ లో కూడా మంగళవారం అర్ధరాత్రి నుండి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది అక్కడి ప్రభుత్వం. ఈ ఉచిత ప్రయాణం బుధవారం అర్ధరాత్రి వరకు ఉంటుంది. మంగళవారం హోలీ – దూలంది పండుగ జరుపుకున్న నేపథ్యంలో మహిళలకు ఇది మంచి బెనిఫిట్ అని చెబుతున్నారు. చాలామంది హోలీ పండుగ సందర్భంగా ఇతర ప్రాంతాలకు, జిల్లాలకు వెళ్లారు. అలా వెళ్లిన విద్యార్థినీలు, ఉద్యోగినీలు, ఇతర పనులు చేసే వారికి ఇది ప్రయోజనం కలిగిస్తుంది. రాజస్థాన్ రాష్ట్ర పరిధిలోనే ఈ ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.