IIM Ahmedabad: డిగ్రీ, ఇంజినీరింగ్ చేసినప్పటికీ మెనెజ్‌మెంట్ కోర్సు కంపల్సరీ.. ఎంబీఏ చేస్తే సరైన గౌరవం, గుర్తింపు ఉంటాయి. టాప్ కంపెనీల్లో జాబ్స్ వస్తుంటాయి. ఇక ఐఐఎంలో ఎంబీఏ చేస్తే వేరే లెవల్. అక్కడ చదివేందుకు యువత చాలా ఉత్సాహం చూపిస్తారు. ఒడిశాకు చెందిన ద్విబేష్ నాథ్ (33) (Dwibesh Nath) పట్టువదలకుండా ట్రై చేశాడు. ఐఐఎంలో సీటు కోసం 9 సార్లు క్యాట్ రాశాడు. పదో సారి ఆయనకు కల నెరవేరింది. దీంతో తెగ సంబరపడి పోతున్నాడు.
ఎంబీఏ చేయడమే డ్రీమ్
ద్విబేష్ నాథ్ (Dwibesh Nath) ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. తర్వాత మాస్టర్స్ కన్నా ఎంబీఏ చేయడంపై దృష్టిసారించాడు. ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉండగా 2014లో ఫస్ట్ టైమ్ క్యాట్ ఎగ్జామ్ రాశాడు. అప్పుడు అతనికి మంచి మార్కులు రాలేదు. తర్వాత రాసిన సమయంలో మార్కులు బాగానే వచ్చాయి.. కానీ సీటు రాలేదు. ఐఐఎం అహ్మదాబాద్‌లో సీటు వచ్చేలా మార్క్స్ స్కోర్ చేయలేదు. ప్రతిష్టాత్మక సంస్థలో ఎంబీఏ చేయాలని భావించిన ద్విభేష్.. ఓ వైపు జాబ్ చేస్తూనే.. మరోవైపు ఎంబీఏ కోసం ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాస్తూనే ఉన్నాడు.
మంచి జాబ్
మంచి సంస్థలో పై చదువు చదివితే క్యాంపస్ సెలక్షన్ కూడా అలానే ఉంటుందని.. మంచి కంపెనీలో ఉద్యోగం వస్తోందని చెబుతున్నారు. అందుకోసమే ఇన్నాళ్లూ తాను ఎదురుచూశానని తెలిపారు. ఐఐఎంలో సీటు సంపాదించడంలో ఆలస్యానికి కారణం కూడా ఉందని నాథ్ (Nath) చెబుతున్నారు. తన హై స్కూల్ ఒడియా మీడియం స్కూల్లో జరిగిందని.. ఇంగ్లీష్‌లో చాలా వీక్ అని వివరించారు. తన ఇంగ్లీష్ యాస విమర్శలకు గురయ్యిందని.. అదీ తనను నిరాశకు గురిచేసిందని అంటున్నారు.
వర్క్ చేస్తూనే..
ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు నాథ్ (Nath). సాప్ట్ వేర్ ఇంజినీర్‌గా చేస్తూనే.. ఎంబీఏ చేయాలని ఇంట్రెస్ట్ చూపించాడు. అహ్మదాబాద్ ఐఐఎంలో పీజీ చేయడం తన కలగా భావించాడు. ప్రతీ ఏడాది క్యాట్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అయి రాసేవాడు. చివరికీ అహ్మదాబాద్ ఐఐఎంలో సీటు సంపాదించాడు. లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం నాథ్ కిర్లొస్కర్ మోటార్లో పనిచేసేవాడు. అంతకుముందు 10 ఏళ్ల మారుతి సుజుకీ కంపెనీలో వర్క్ చేశాడు. జార్ఖండ్‌లో ఉన్న ఎన్జీవో సంస్థకు కో ఫౌండర్‌గా ఉన్నారు. ఐఐఎం అహ్మదాబాద్‌లో చేరి రెండు నెలలు అవుతుంది. ఈ సమయం తనకు అద్భుతమైన క్షణాలను అందించిందని నాథ్ అంటున్నారు.