అదానీ ఆస్తులు జాతీయం చేయండి: బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి
హిండెన్‌బర్గ్ నివేదిక ప్రకారం అదానీ గ్రూపు షేర్లు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. దీంతో ఈ కుంభకోణంపై దర్యాప్తు చేయాలని విపక్షాలు కేంద్రంపై తీవ్ర ఒత్తిడిని తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అదానీ వ్యవహారంపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు.
హిండెన్‌బర్గ్ నివేదిక ప్రకారం అదానీ(adhani) గ్రూపు షేర్లు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. దీంతో ఈ కుంభకోణంపై దర్యాప్తు చేయాలని విపక్షాలు కేంద్రంపై తీవ్ర ఒత్తిడిని తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అదానీ(adhani) వ్యవహారంపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి(subramanya swamy) షాకింగ్ కామెంట్స్ చేశారు. అదానీ గ్రూపు ఆస్తులను కేంద్ర ప్రభుత్వం జాతీయం చేయాలన్నారు. ఆ ఆస్తులను వేలం వేయాలని కోరారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలను తెలిపారు. అదానీ వ్యవహారం, కేంద్ర బడ్జెట్ వంటి అంశాలపై పలు విషయాలను వెల్లడించారు.
అదానీ(adhani) గ్రూపు ఆస్తులన్నీ జాతీయం చేసి వాటిని వేలం వేయాలని, వచ్చిన నగదును నష్టపోయిన వారికి అందజేయాలని సుబ్రహ్మణ్య స్వామి(subramanya swamy) తెలిపారు. అదానీ(adhani)తో ఒప్పందాలు లేవని కాంగ్రెస్ చెబుతున్నప్పటికీ ఆ పార్టీలో అదానీతో ఒప్పందాలున్న వ్యక్తుల గురించి తనకు తెలుసని అన్నారు. అయినా తాను కాంగ్రెస్‌ను పట్టించుకోనని అన్నారు. ప్రధాని మోదీ ఏదో దాచిపెడుతున్నారనే భావన ప్రజల్లో ఉందని, దానిపై ప్రభుత్వమే స్పష్టతనివ్వాలని తెలిపారు.
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ మరణంపై సుబ్రహ్మణ్య స్వామి సానుభూతి వ్యక్తం చేశారు. కార్గిల్ యుద్ధానికి కారణమైన వ్యక్తి గురించి ఎలా మాట్లాడుతున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారని, కానీ ఆ యుద్ధం జరిగే సమయంలో పాక్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ ఉన్నట్లు గుర్తు చేశారు. షరీఫ్ ఆదేశాల మేరకు ముషారఫ్ తన సైనికులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. నిబంధనలను పక్కనబెట్టి పాక్‌లో అడుగుపెట్టిన మోదీ ఆనాడు నవాబ్ షరీఫ్‌తో కలిసి భోజనం చేశారని, ఆ విషయం గురించి నెటిజన్లు ఎందుకు మాట్లాడ్డం లేదని ప్రశ్నించారు.
ముషారఫ్ వ్యక్తిగతంగా తనకు తెలుసని, పాక్‌లో చాలా సార్లు ఆయన్ని కలిసినట్లు గుర్తు చేసుకున్నారు. తాలిబన్లను అంతం చేయడానికి అమెరికాతో కలిసి ముషారఫ్ పని చేశారన్నారు. ముషారఫ్ విషయంలో తనను ప్రశ్నించే ముందు కార్గిల్ యుద్ధానికి ముఖ్య కారకుడైన నవాజ్ షరీఫ్ ఇంటికి మోదీ ఎందుకు వెళ్లారనే ప్రశ్నకు నెటిజన్లు సమాధానం ఇవ్వలేరని సుబ్రహ్మణ్య స్వామి(subramanya swamy) తెలిపారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(nirmala sitaraman)పై అనేక విమర్శలు చేస్తున్న సుబ్రహ్మణ్య స్వామి(subramanya swamy) తాజాగా కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక బోగస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా దేశ వృద్ధి రేటు 3 నుంచి 4 శాతం మాత్రమే ఉంటోందని, కానీ వచ్చే ఏడాదికి 6.5 శాతం వృద్ధి రేటు ఉంటుందన్నారు. బడ్జెట్లో వ్యవసాయం, పరిశ్రమలకు ప్రాధాన్యతే లేదన్నారు. ప్రభుత్వానికి ఏ రకమైన వ్యూహం లేదని బడ్జెట్లో స్పష్టంగా తెలుస్తోందన్నారు. మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ విక్టోరియా గౌరీని నియమించడాన్ని ఆయన సమర్థించారు.