»Maharashtra Hanuman Idol Gets Stuck In Child Throat
Idol Struck in Throat చిన్నారి గొంతులో ఇరుక్కున్న Hanuman విగ్రహం
మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆడుకుంటుండడంతో కుటుంబసభ్యులు తమ పనులు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఆకస్మాత్తుగా చిన్నారి రోదించడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు వచ్చి చూడగా బాలిక విలవిలలాడుతోంది. గొంతు పట్టుకుని ఊపిరాడకపోవడంతో గట్టిగా ఏడుస్తూ ఉంది.
ఊహ లేకపోవడంతో చిన్నారులు దొరికిన వస్తువులను (Items) నోట్లో పెట్టేసుకుంటారు. అందుకే తల్లిదండ్రులు (Parents) పిల్లలను వదిలేసిన సమయంలో వారిని ఓ కంట కనిపెడుతూ (Observation) ఉండాలి. లేదంటే అనర్థాలు చోటుచేసుకుంటాయి. ఇలాగే ఓ చిన్నారి తన మెడలో ఉన్న 3 ఇంచుల హనుమాన్ బొమ్మను (Hanuman Idol) మింగేసింది. ఆ బిల్ల గొంతులో (Metal) అడ్డం పడి చిన్నారి విలవిలలాడింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. కొన్ని గంటల పాటు శ్రమించి వైద్యులు (Doctors) దాన్ని తొలగించారు. ఈ సంఘటన మహారాష్ట్రలో (Maharashtra) చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
హింగోలి జిల్లా (Hingoli District) కేంద్రానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి ఇటీవల ఇంట్లో ఉండగా ఆడుకుంటోంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆడుకుంటుండడంతో కుటుంబసభ్యులు తమ పనులు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఆకస్మాత్తుగా చిన్నారి రోదించడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు వచ్చి చూడగా బాలిక విలవిలలాడుతోంది. గొంతు పట్టుకుని ఊపిరాడకపోవడంతో గట్టిగా ఏడుస్తూ ఉంది. అయితే బాలిక మెడలో ఉన్న హనుమాన్ విగ్రహం కనిపించలేదు. దీంతో బాలిక ఆ విగ్రహాన్ని మింగి ఇబ్బంది పడుతుందని గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించారు.
నాందేడ్ (Nanded)లోని గెలాక్సీ ఆస్పత్రికి వెళ్లగా చిన్నారి గొంతులో హనుమంతుడి బిల్ల ఇరుక్కుపోయిందని వైద్యులు తెలిపారు. డాక్టర్ నితిన్ జోషి (Dr Nitin Joshi) ఆధ్వర్యంలోని వైద్యుల బృందం సాయంత్రం 6.30 గంటల సమయంలో పాప గొంతులోని హనుమాన్ విగ్రహాన్ని తీసివేశారు. దీంతో ఆ చిన్నారి నరకం నుంచి కోలుకుంది. ప్రస్తుతం పాప క్షేమంగా ఉందని డాక్టర్ నితిన్ తెలిపారు. విగ్రహం తొలగించిన వైద్యుడిని బాలిక కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలిపారు. కాగా గతంలో కర్ణాటకలో (Karnataka) కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. 45 ఏళ్ల వ్యక్తి పొరపాటున కృష్ణుడి విగ్రహాన్ని మింగాడు. వైద్యులు విగ్రహాన్ని తొలగించారు.