కానిస్టేబుల్‌తో మహిళా ఎస్ఐ మసాజ్ చేయించుకుంది. అయితే.. ఆ కానిస్టేబుల్ మహిళే అయినా కూడా స్టేషన్లో ఎస్ఐ ఈ పనులు ఏంటంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో చోటు చేసుకుంది. ఠాకూర్ గంజ్ పోలీస్ స్టేషన్లో మునీతా సింగ్ ఎస్ఐ. అదే స్టేషన్లో పని చేసే లేడీ కానిస్టేబుల్‌తో మసాజ్ చేయించుకుంటుండగా ఎవరో వీడియో తీసి దాన్న సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఆ వీడియో వైరల్‌గా మారి పోలీసు ఉన్నతాధికారుల కంట పడింది. దీంతో వెంటనే ఆ మహిళా ఎస్ఐని సస్పెండ్ చేశారు.