మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అక్కడ సోమవారం రాత్రంత కేజ్రీవాల్ నిద్రలేకుండానే గడిపాడని జైలు అధికారులు వెల్లడించారు.
Kejriwal: ఢిల్లీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం కేజ్రీవాల్ తీహార్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 15 వరకు ఆయనకు రిమాండు విధించింది కోర్టు. ఈ మేరకు జైలులోని గడిపిన మొదటి రోజు ఆయనకు చాలా దారుణంగా గడచినట్లు తెలుస్తుంది. సోమవారం రాత్రంతా నిద్రలేకుండానే గడిపినట్లు జైలు అధికారులు వెల్లడించారు. జైలు నంబర్ 2లోని సెల్‌కు తరలించిన తర్వాత అక్కడ ఉన్న ఓ సిమెంట్ దిమ్మెపై కాసేపు కూర్చొని, ఆ తరువాత అర్ధరాత్రి దాటే వరకు సెల్లోనే అటుఇటు తిరిగారట. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కేజ్రీవాల్‌కు సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వచ్చిన భోజనం వడ్డించారు. ఆయన షుగర్ లెవల్స్ సాధారణ స్థితికి వచ్చే వరకు మధ్యహ్నాం, రాత్రి ఇంటి భోజనం చేసేందుకు కోర్టు అనుమతిచ్చింది.
సీఎం కేజ్రీవాల్ అధికారిక కార్యకలాపాల నిమిత్తం ప్రభుత్వ అధికారులను జైల్లోనే కలవచ్చు, పాలన సంప్రదింపులు జరపవచ్చు. అలాగే వారానికి రెండు సార్లు తన కుటుంబ సభ్యులను కలవచ్చు. వారి పేర్లను జైలు అధికారులు అనుమతి అవసరం. ఆయనకు రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. జైల్లో ఆయనకు టీవీ చూసే సదుపాయం కల్పించారు. వార్తలు, వినోద, క్రీడా కార్యక్రమాలతో కూడిన 18 నుంచి 20 చానళ్లను ఆయన చూడొచ్చు. మంగళవారం ఆయన సతీమణి ఆయన్ను కలిసే అవకాశం ఉంది. తీహార్ జైల్లె పటిష్టమైన భద్రత ఉంది. అందులో మొత్తం 650 మంది ఖైదీలు ఉండగా అందులో 600 మంది దోషులుగా తెలారు. మొత్తం జైలులో 650 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఏదైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే స్పందించేందుకు క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అందుబాట్లోనే ఉంటాయి.