ప్రముఖ బాలీవుడ్ నటి కంగన రనౌత్ (Kangana Ranaut) అరుదైన ఘనత సాధించారు. రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం చేసే భారతదేశపు మొట్టమొదటి మహిళగా గుర్తింపు పొందారు. దసరా సందర్భంగా ఢిల్లీ(Delhi)లోని లవ్‌కుశ్ రాంలీలా మైదానంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న ఆమె రావణ దహనం చేసిన తొలి మహిళగా రికార్డులకెక్కారు. దిష్టిబొమ్మను దహనం చేసే అవకాశాన్ని లవ్ కుశ్ రామ్ లీలా కమిటీ (Ram Leela Committee) నటి కంగనా రనౌత్ కు కల్పించింది. యాభయ్యేళ్ల చరిత్రలో ఏటా జరుగుతున్న ఈ కార్యక్రమంలో మొట్టమొదటి సారిగా ఒక మహిళ రావణుడి దిష్టిబొమ్మను దహనం చేస్తోందని, జై శ్రీరామ్ అంటూ కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు.
శ్రీరాముడి (Sri Rama) వంటి వారు ఈ లోకంలోనే లేరని, అలాంటి పురుషుడు మళ్లీ రారని పేర్కొన్నారు. ఎర్రటి చీరకట్టులో కార్యక్రమానికి హాజరైన కంగన జైశ్రీరామ్ అంటూ రావణ, కుంభకర్ణ, మేఘనాథుల ప్రతిమలను దహనం చేశారు. కాగా, బాణసంచా నిషేధించాలన్న ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో రికార్డు చేసిన బాణసంచా శబ్దాలను సౌండ్ బాక్స్‌ల ద్వారా వినిపించారు. కాగా, కంగన నటించిన ‘తేజస్’ సినిమా (Tejas movie) 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆమె చిత్ర ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Kejriwal), లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్‌కుమార్ సక్సేనా హాజరయ్యారు.