»Indian Employees Average Salary Hike To Be 10 2 In 2023
Average Salary Hike in India: సగటు వేతన పెంపు 10.2 శాతం
భారత్ లో ఉద్యోగుల వేతనాలు (Average Salary Hike in India) 2023 ఏడాదిలో సగటున 10.2 శాతం పెరిగే అవకాశం ఉందని ప్రొఫెషనల్ సర్వీసులు అందించే సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (EY) తెలిపింది. గత ఏడాది ఇది 10.4 శాతంగా ఉందని వెల్లడించింది.
భారత్ లో ఉద్యోగుల వేతనాలు (Average Salary Hike in India) 2023 ఏడాదిలో సగటున 10.2 శాతం పెరిగే అవకాశం ఉందని ప్రొఫెషనల్ సర్వీసులు అందించే సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (EY) తెలిపింది. గత ఏడాది ఇది 10.4 శాతంగా ఉందని వెల్లడించింది. కార్మిక స్థాయి ఉద్యోగులకు తప్ప మిగిలిన అన్ని స్థాయిలలో వేతనాల పెంపు 2022తో (average salary hike of employees) పోలిస్తే కాస్త తక్కువగానే ఉండనుందని పేర్కొన్నది. అయితే ఇప్పటికీ డబుల్ డిజిట్ ఉండటం గమనార్హం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence – AI), మిషన్ లెర్నింగ్ (Machine Learning – ML), క్లౌడ్ కంప్యూటింగ్ (cloud computing) వంటి వాటికి అధిక డిమాండ్ ఉందని, ఇందులో పదిహేను శాతం నుండి ఇరవై శాతం వరకు అధిక వేతనాలు ఉన్నట్లు తెలిపింది.
ఈ-కామర్స్, ప్రొఫెషనల్ సర్వీసులు, ఐటీ రంగాల్లో వేతనాల పెంపు అత్యధికంగా ఉంటుందని తెలిపింది. ఈ రంగాల్లో వరుసగా 12.5 శాతం, 11.9 శాతం, 10.8 శాతం పెంపు ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. 2022లో ఈ రంగాల్లో ఉద్యోగుల వేతనాల పెంపు వరుసగా 14.2 శాతం, 13 శాతం, 11.6 శాతంగా ఉన్నట్లు తెలిపింది. భారత్ లో ఉద్యోగుల వలస రేటు తగ్గినట్లు వెల్లడించింది. 21.2 శాతంతో రెండేళ్ల క్రితం స్థాయికి పడిపోయినట్లు పేర్కొన్నది. స్వచ్చంధల వలసల రేటు 16.8 శాతంగా ఉన్నదని వెల్లడించింది. భవిష్యత్తు వృద్ధి అవకాశాలు సన్నగిల్లడం, పరిహారాల్లో హెచ్చుతగ్గులు, పదోన్నతులు లేకపోవడం, గుర్తింపు లేకపోవడం వలసలకు ప్రధాన కారణమని వెల్లడించింది.ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్, ఈ-కామర్స్, టెక్నాలజీ రంగాల్లో అత్యధిక ఉద్యోగుల వలసలు ఉన్నట్లు తెలిపింది.