»Gyanavapu Masjid Ruins Of Hindu Temple Under The Mosque
Gyanavapu Masjid: మసీదు కింద హిందూ ఆలయ శిథిలాలు!
ఉత్తరప్రదేశ్ వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు కింద హిందూ ఆలయం ఉండేదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఇక్కడ అతి పెద్ద హిందూ దేవాలయం ఉండేదని, ఆ ఆలయాన్ని కూల్చి అక్కడ మసీదు నిర్మించినట్లు ఏఎస్ఐ తెలిపింది.
Gyanavapu Masjid: ఉత్తరప్రదేశ్ వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మసీదు కింద హిందూ ఆలయం ఉండేదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఇక్కడ అతి పెద్ద హిందూ దేవాలయం ఉండేదని, ఆ ఆలయాన్ని కూల్చి అక్కడ మసీదు నిర్మించినట్లు ఏఎస్ఐ తెలిపింది. మసీదు నిర్మాణంలో ఆలయం స్తంభాలను, రాళ్లను ఉపయోగించారని, ఆలయం గోడలతో పాటు కొన్ని ఇతర నిర్మాణాలను యథాతథంగా మసీదులో కలిపేశారని తెలిపారు.
హిందూ కక్షిదారుల తరపున న్యాయవాది విష్ణుశంకర్జైన్ విలేకరుల సమావేశంలో సర్వే నివేదికల వివరాలను తెలిపారు. ఇప్పుడు ఉన్న మసీదు గోడలపై, అంతకు ముందు ఉన్న ఆలయ నిర్మాణం తాలూకు గోడలపై 34 శాసనాలు ఉన్నట్లు తెలిపింది. పురాతన దేవాలయానికి సంబంధించిన శాసనాలు కూడా ఆ ఆవరణలో లభించాయని.. అవి దేవనాగరి, తెలుగు, కన్నడతోపాటు ఇతర భాషల్లో ఉన్నాయని తెలిపారు. సాధారణంగా ఈ శాసనాలను హిందూ ఆలయాల నిర్మాణాల్లో ఉపయోగిస్తారు. మసీదు నిర్మాణాల్లో ఉపయోగించరని తెలిపారు. ఆలయం గోడల మీద చిత్రించిన కమలం గుర్తులను తొలగించి ఆ గోడలను మసీదు నిర్మాణంలో ఉపయోగించారని సర్వేలో తేలింది.