»Republic Day Republic Celebrations To Be Held Grandly
Republic day: ఘనంగా నిర్వహించనున్న గణతంత్ర వేడుకలు
ఢిల్లీలో ఉదయం 10:30 గంటలకు 75వ గణతంత్ర వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకల్లో మహిళలు వాళ్ల శక్తిని చాటనున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు.
Republic day: ఈ రోజు దేశమంతా రిపబ్లిక్ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఢిల్లీలో ఉదయం 10:30 గంటలకు 75వ గణతంత్ర వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకల్లో మహిళలు వాళ్ల శక్తిని చాటనున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. డిల్లీలోని కర్తవ్యపథ్‌లో 90 నిమిషాలపాటు జరిగే ఈ కార్యక్రమంలో మహిళలు సైనిక శక్తిని చాటడంతో పాటు పలు సాంస్కృతిక ప్రదర్శనలు అలరించనున్నారు. రిపబ్లిక్ థీమ్‌ను జాతీయ మహిళా శక్తితో పాటు ప్రజాస్వామిక విలువల ఆధారంగా రూపొందించారు. ఇందులో తొలిసారిగా అందరూ మహిళలే సభ్యులుగా ఉన్న త్రివిధ దళాలు పాల్గొంటున్నాయి.
పరేడ్‌లో 100 మంది మహిళలు భారతీయ సంగీతాన్ని వినిపిస్తారు. సంప్రదాయ బ్యాండ్‌కు బదులుగా శంఖం, నాదస్వరం, నగారా వినియోగించనున్నారు. 15 మంది మహిళా పైలట్లు వాయు సేన విన్యాసాలను ప్రదర్శించనున్నారు. జాతీయ వార్ మెమోరియల్‌ను ప్రధాని మోదీ సందర్శించడంతో వేడుకలు ప్రారంభం అవుతాయి. తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ సంప్రదాయ బగ్గీలో వేదిక వద్దకు వస్తారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత ఈ బగ్గీని వాడుతున్నారు. ఈ సారి పరేడ్‌లో 90 మంది సభ్యుల ఫ్రాన్స్ దళం కూడా పాల్గొంటోంది. 260 మంది సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఎసఎస్బీ మహిళా సైనికులు నారీ శక్తి పేరుతో విన్యాసాలు ప్రదర్శిస్తారు.