Mayonnaise: ఇంట్లో మయోన్నైస్ ఎలా తయారు చేయాలో తెలుసా?
ఈ మధ్యకాలంలో అందరూ ఎక్కువగా ఇష్టపడుతున్న ఫుడ్ లో మయోన్నైస్ కూడా ఒకటి. దీనిని ప్రతి ఫుడ్ లోనూ కలిపి ఇష్టంగా లాగించేస్తున్నారు. చికెన్ లాంటి స్టాటర్స్ దగ్గర నుంచి పాస్తా, హెల్దీ సలాడ్ కాంబినేషన్ లో కూడా వాడుతున్నారు. ఈ మయోన్నైస్ బయట మార్కెట్లో బాగానే దొరుకుతుంది. మరి దీనిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
తయారీ విధానం
జీడిపప్పుని వేడినీటిలో 15 నిమిషాలు నానబెట్టాలి.
మిక్సీజార్లో నానబెట్టిన జీడిపప్పు, పనీర్, వెల్లుల్లి వేసి బరకగా మిక్సీ పట్టాలి.
తర్వాత ఒరిగానో, రుచికి ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ వేయండి.
తర్వాత నిమ్మరసం కూడా వేసి బాగా మిక్సీ పట్టాలి.
సేవించు విధానం
ఇలా తయారైన మయోన్నైస్ని గ్లాస్ జార్లో వేసి ఫ్రిజ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇది 10 రోజుల వరకూ తాజాగా ఉంటుంది. బ్రెడ్ స్లైసెస్, రోటీస్, పాస్తా ప్రిపేర్ చేసుకుని తినొచ్చు. ఇది బయట దొరికే మయోన్నైస్ కంటే చాలా టేస్టీగా ఉంటుంది కూడా.
చిట్కాలు
మీరు ఇష్టం వచ్చినట్లుగా మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ యొక్క మోతాదును పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు.
మీరు రుచికి తగినట్లుగా ఉప్పును కూడా సర్దుబాటు చేసుకోవచ్చు.
మీరు కొత్తిమీర, ఆవాలు వంటి ఇతర మసాలాలను కూడా జోడించవచ్చు.