Former Uttarakhand Chief Minister Harish Rawat's car hit the divider. He has minor injuries
Harish Rawat: కాంగ్రెస్ నేత, ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్(Harish Rawat)కు ప్రమాదం తప్పింది. ఉదమ్‌సింగ్ నగర్ జిల్లాలో అతని కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో రావత్‌కు గాయాలయ్యాయి. మంగళవారం రాత్రి ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి హల్ద్వానీ నుంచి కాశీపుర్ వెళ్తుండగా ఇన్సిడెంట్ జరిగింది. బజ్పూర్ రైల్వే క్రాసింగ్ సమీపంలో ఓ వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో డ్రైవర్ కంట్రోల్ తప్పాడు. ఆ సమయంలో కారు ముందు సీట్లో కూర్చొని ఉన్న రావత్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. అనంతరం ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు.