Election Nominations: Nominations can also be made online
Election Nominations: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనూ నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఆన్లైన్లో నామినేషన్ దాఖలు చేయాలంటే ఈ నెల 24లోగా ప్రింట్ తీసుకుని సంబంధిత రిటర్నింగ్ అధికారికి అందజేయాలన్నారు. నామినేషన్ పత్రాలు, అఫిడవిట్ జాగ్రత్తగా నింపాలని తెలిపారు. మూడు సెట్ల నామినేషన్ పత్రాలు ఇవ్వొచ్చని, వాటితోపాటు 5 ఫొటోలు ఇవ్వాలని తెలిపారు. అఫిడవిట్‌లోని ప్రతి పేజీలో సంతకం చేయాలని, ప్రతి కాలమ్ నింపాలని తెలిపారు. ఎన్నికల ఖర్చుపై అభ్యర్థి బ్యాంకు ఖాతా ఓపెన్ చేయాలి. ఫొటోల విషయంలో అభ్యర్థులు చాలా జాగ్రత్త వహించాలి. టోపీలు, కళ్లద్దాలు పెట్టుకుని ఫొటోలు దిగరాదు. కనీసం రెండు నెలల ముందు తీసుకున్న ఫొటోలను మాత్రమే అందజేయాలి. అభ్యర్థుల ముఖాలు స్పష్టంగా ఉండేలా జాగ్రత్త పడాలని వికాస్‌రాజ్ తెలిపారు.