KTR: Adani, Ambani waived lakhs of crores of loans
KTR: కేంద్రప్రభుత్వం పేదల రక్తం పీల్చి కోట్లు వసూలు చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ పదేళ్లలో కేంద్రం లక్షల కోట్ల రూపాయిలను పేదల నుంచి దోచుకుందన్నారు. పెట్రోల్, డీజిల్పై పన్నుల రూపంలో గత పదేళ్లలో రూ.30 లక్షల కోట్లు వసూలు చేశారని కేటీఆర్ అన్నారు. అదానీ, అంబానీలకు రూ.14.5 లక్షల కోట్లు రుణమాఫీ చేశారని ఆరోపించారు.
కేటీఆర్ చెప్పేవి తప్పని బీజేపీ నేతలు నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఆయన సవాల్ విసిరారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను 10-12 సీట్లలో గెలిపిస్తే ఆరు నెలల్లో కేసీఆర్ రాష్ట్రాన్ని శాసించే స్థితికి వస్తారు. మోదీ సెస్సుల రూపంలో కొత్త పన్నులు వసూలు చేశారు. హైవేల కోసమే ఇలా చేస్తున్నట్లు సమర్థించుకుంటున్నారు. పెట్రోల్, డీజిల్పై పన్నులు వేస్తే హైవేలపై టోలో ఛార్జీలు ఎందుకని, వీటిపై ప్రశ్నిస్తే బీజేపీ వద్ద జవాబు లేదని కేటీఆర్ అన్నారు.