BRS Party : బండి సంజయ్ విమర్శలకు కౌంటర్ ఇచ్చిన బీఆర్ఎస్..!
Bandi Sanjay : అధికార బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ట్విట్టర్ వేదికగా ఆయన కౌంటర్లు వేశారు. కాగా... ఆ కౌంటర్లకు బీఆర్ఎస్ పార్టీ తాజాగా.. మరో కౌంటర్ ఇచ్చింది. ప్రజలను మోసం చేయడం ఒక ఆర్ట్ అయితే.... అందులో మోదీ పికాసో అంటూ బీఆర్ఎస్ కౌంటర్ ఇవ్వడం విశేషం
బీజేపీ నేత బండి సంజయ్… అధికార బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ట్విట్టర్ వేదికగా ఆయన కౌంటర్లు వేశారు. కాగా… ఆ కౌంటర్లకు బీఆర్ఎస్ పార్టీ తాజాగా.. మరో కౌంటర్ ఇచ్చింది. ప్రజలను మోసం చేయడం ఒక ఆర్ట్ అయితే…. అందులో మోదీ పికాసో అంటూ బీఆర్ఎస్ కౌంటర్ ఇవ్వడం విశేషం.
ఇంతకీ అసలు మ్యాటరేంటంటే… ఏప్రిల్ 01 సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్..ట్విట్టర్ ద్వారా ‘ఓ నిరుద్యోగి ఫోన్ కు వచ్చిన మెసేజ్’ అని రాసి ఉన్న ఓ ఫొటోతో పాటు సీఎం కేసీఆర్ అన్న అప్పటి మాటలను క్యాప్షన్ లో చేర్చారు. దాంతో పాటు మీరు దీనిని నమ్మితే ఏప్రిల్ ఫూల్స్ డే శుభాకాంక్షలు అంటూ సెటైరికల్ గా రాసుకొచ్చారు. బండి సంజయ్ షేర్ చేసిన ఈ ఫొటోలు‘మీ అకౌంట్ లో రూ.3,016 పడ్డాయి’ అనే మెసేజ్ ఇంగ్లీష్ లో ఉంది. దాని కిందే సీఎం కేసీఆర్ నవ్వుతున్న ఫొటోను షేర్ చేస్తూ పోస్ట్ చేసారు.
దీనిపై బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. ‘ఫూల్స్ డే: దేశంలో దీన్ని ‘అచ్చే దిన్’ అంటారు. మనల్ని మన ‘విశ్వ గురు’ ఎలా ఫూల్ చేశారో గుర్తు చేసుకుందాం’’ అని రాసి ఉన్న పోస్టర్ ను బీఆర్ఎస్ షేర్ చేసింది. బుల్లెట్ ట్రైన్, అందరి ఖాతాల్లో రూ.15 లక్షలు, అందరికీ ఇళ్లు, బ్లాక్ మనీని వెనక్కి తెప్పించడం, స్మార్ట్ సిటీలు, మహిళా భద్రత.. ఇలా అన్ని విషయాల్లో ఫూల్ చేశారని ఆరోపించింది. రవితేజ తాజా సినిమా ‘రావణాసుర’లోని డైలాగ్ ను గుర్తు చేసేలా.. ‘‘ప్రజలను మోసం చేయడం ఒక కళ అయితే.. మోడీ జీ అందులో పికాసో’’ అని సెటైర్ పేల్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతుంది.