»Bhagyanagar Shobha Yatra Mla Raja Singh Sankalp Hindu Rashtra
Bhagyanagar shobha yatra: అఖండ హిందూ రాష్ట్ర్ కోసం రాజాసింగ్ ప్రతిజ్ఞ, నేను చనిపోతే…
శ్రీరామ నవమి సందర్భంగా జరిగిన శోభాయాత్రలో గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ అఖండ హిందూ రాష్ట్రం కోసం ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వచ్చిన భక్తులు, అభిమానులతో సంకల్పం చేయించారు.
భారత దేశం మరిన్ని ముక్కలు కాకుండా కాపాడుకోవడానికి, అఖండ హిందూ రాష్ట్రంగా (Akhand Hindu Rasthra) ఏర్పాటు చేసేందుకు మనం సంకల్పం తీసుకుందామని గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ (MLA Raja Singh) గురువారం రాత్రి పిలుపునిచ్చారు. శ్రీరామ నవమి (Sri Rama Navami) సందర్భంగా ఆకాశ్ పురి హనుమాన్ మందిర్ (Akashpuri Hanuman Mandhir) నుండి కోఠి హనుమాన్ వ్యాయామశాల (Koti Hanuman Vyayamashala) వరకు నిర్వహించిన విశాల్ శోభా యాత్రలో (Rama Navami Shobha Yatra) ఆయన పాల్గొన్నారు. ఆయన బేగంబజార్ ఛత్రి కూడలిలో హిందూ రాజ్య స్థాపన (Hindu Rajya) కోసం సంకల్పం తీసుకోవాలంటూ భక్తులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న వారు అందరూ అఖండ హిందూ రాజ్య స్థాపన కోసం మద్దతుగా తమ వద్ద ఉన్న సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వెలిగించారు.
భక్తులతో ప్రతిజ్ఞ చేయించినరాజాసింగ్
నేను రాజాసింగ్.. అంటూ ర్యాలీలో పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు. అయితే అందరూ కూడా నేను రాజాసింగ్ అన్నారు. అయితే అలా కాదు.. నేను నా పేరు తీసుకుంటాను.. మీరు మీ మీ పేర్లతో సంకల్పం తీసుకోవాలని సూచించారు. నేను రాజాసింగ్… భగవాన్ శ్రీ రామ్ జీ సాక్షిగా అఖండ హిందూ రాష్ట్రం కోసం ఈ రోజు నేను సంకల్పం తీసుకుంటున్నాను… సాధు సంతువుల రక్షణకు కట్టుబడి ఉంటానని, దేశంలోని మాతా, సోదరీమణులను కాపాడుతానని, గోహత్యలపై పోరాడుతానని, ధర్మాన్ని కించపరిచే వారికి గట్టిగా జవాబు చెబుతాను.. తాను జీవించి ఉన్నంత వరకు హిందూ రాష్ట్రం కోసం పని చేస్తానని.. జీవించి ఉన్నంత వరకు హిందూ రాష్ట్ర కోసం పని చేస్తానని ప్రతిజ్ఞ చేయించారు. దేశంలోని వంద కోట్ల మంది హిందువులు అఖండ హిందూ రాజ్య స్థాపన కోసం సంకల్పం తీసుకోవాలన్నారు. భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్ నినాదాలు ఇచ్చారు.
నేను చస్తే…
ఈ సందర్భంగా రాజాసింగ్ తన పెద్ద కొడుకును పరిచయం చేశారు. ధర్మ రక్షణలో నేను రేపు చనిపోతే… నా స్థానంలో నా పెద్ద కొడుకు హిందుత్వం కోసం పోరాటం చేస్తారు అని చెప్పారు. నా పరివారం పైన (హిందువుల పైన) ఎవరైనా చేయి చూపిస్తే వారి చేయి తీసేస్తామని హెచ్చరించారు. చత్రపతి శివాజీ, శంభాజీ మహారాజ్, గురుగోవింద్ సింగ్ లను తాము ఆదర్శంగా తీసుకుంటామన్నారు.
రాజాసింగ్ కోసం వేచి చూసిన భక్తులు, అభిమానులు
రాజాసింగ్ కోసం అభిమానులు ఎంతో వేచి చూశారు. అలాగే రామ భక్తులు కూడా ఆయన ఏం మాట్లాడుతారోనని గంటల కొద్ది వేచి చూశారు. ఆయన వచ్చిన ప్రతి చోట జై శ్రీరామ్ అంటూ దద్దరిల్లింది. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.