»Amit Shah Said Modi Government Open Schools Congress Government Will Bring Liquor Shop In Chhattisgarh
Amit Shah: మోడీ ప్రభుత్వం స్కూళ్లు తెరిస్తే..ఈ ప్రభుత్వం మద్యం షాపులు తెస్తుంది
మోడీ ప్రభుత్వం స్కూళ్లు తెరుస్తుంటే..ఇక్కడి అధికార ప్రభుత్వం మద్యం షాపులను తెరుస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా పేర్కొన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.
Amit Shah said Modi government open schools congress government will bring liquor shop in chhattisgarh
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్(chhattisgarh)లో కూడా ఈ నవంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) నేడు జగ్దల్పూర్లో పర్యటించి ప్రసంగించారు. ఛత్తీస్‌గఢ్‌లో రోడ్లు నిర్మించి, వంటగ్యాస్ సిలిండర్లను అందించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వమని పేర్కొన్నారు. అంతేకాదు గత తొమ్మిదేళ్లుగా సబ్సిడీ ధరలకు, మరుగుదొడ్లు, ఏకలవ్య పాఠశాలలను నిర్మించినట్లు గుర్తు చేళారు. కేంద్రం ప్రతి ఇంటికి 5 కిలోల బియ్యాన్ని కూడా ఉచితంగా అందజేస్తోందన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ హాయాంలో ప్రజలకు భూపేష్ బాఘేల్(bhupesh baghel) ఏం చేశారని ప్రశ్నించారు. ఈ సీఎం మద్యం షాపులు తెరిచాడు. రూ.540 కోట్ల బొగ్గు రవాణా కుంభకోణం, గోథన్ స్కీంలో రూ.1300 కోట్ల కుంభకోణం ఇలా అనేకం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుంటే.. బీజేపీ ప్రభుత్వం విద్యపై దృష్టి పెట్టి స్కూళ్లు తెరిపిస్తుందని పేర్కొన్నారు.
#WATCH | Union Minister Amit Shah in Chhattisgarh’s Jagdalpur,” In the last 9 years, the Modi govt developed roads, provided gas cylinders, constructed toilets, Eklavya schools and also gave 5kg rice to every person in a household per month for free. What did you do Bhupesh babu?… pic.twitter.com/cQ9NNFVhYn
అంతేకాదు ఈసారి ఛత్తీస్‌గఢ్ ప్రజలు మూడుసార్లు దీపావళి జరుపుకుంటారని పేర్కొన్నారు. ఒకసారి దీపావళి రోజున, రెండోది డిసెంబర్ 3న ఇక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు..ఆ తర్వాత జనవరి (2024)లో అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రారంభమైనప్పుడని పేర్కొన్నారు. 90 అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 7, 17 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రంలో ఎన్నికలు రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు కీలకం కానున్నాయి. మరోవైపు అధికార కాంగ్రెస్(congress) ఇప్పటి వరకు 83 మంది అభ్యర్థులను ప్రకటించగా, బీజేపీ 86 స్థానాలకు 86 మంది అభ్యర్థులను ప్రకటించింది. గత ఎన్నికల్లో 90 స్థానాలకు గానూ 68 స్థానాల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. ఛత్తీస్‌గఢ్‌ను 15 ఏళ్ల పాటు పాలించిన బీజేపీ(BJP) కేవలం ఐదు స్థానాల్లోనే విజయం సాధించింది.