మహారాష్ట్ర(Maharashtra)లోని థానేలో టెన్త్ క్లాస్ రిజల్ట్స్ రిలీజ్ అయినాయి. విశాల్ అశోక్ కరాద్ (Vishal Ashok Karad) అనే విద్యార్థికి అన్ని సబ్జెక్టుల్లో బార్డర్ మార్కులు వచ్చాయి. ప్రతి సబ్జెక్టులో 35 మార్కులు వస్తే పాస్. మనోడికి కూడా ఒకటి తక్కువ కాకుండా ఒకటి ఎక్కుక కాకుండా సరిగ్గా అంతే వచ్చాయి. అయితే కుమారుడికి అన్ని సబ్జెక్టులలో బార్డర్ మార్కులు (Border marks) వచ్చినప్పటికీ విశాల్ తల్లిదండ్రులు నిరాశ చెందలేదు. పైగా కుమారుడు ఎక్కడ బాధపడతాడోనని కేక్ కట్ చేసి మరి సెలబ్రేషన్స్ చేశారు. ఆ సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో (Social Media) పెట్టడంతో ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి.
దాంతో విశాల్ పేరెంట్స్ (Parents) చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ‘ఈ తల్లిదండ్రులకు నిజంగా హ్యాట్సాఫ్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ర్యాంకుల కోసం ఎక్కడలేని ఒత్తిడికి గురి చేస్తూ ఉంటారు. అంతేనా పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత మార్కులు తక్కువ వచ్చినా లేదా ఫెయిల్ అయినా చుట్టుపక్కల వారితో పోలుస్తూ అవమానకరంగా మాట్లాడే పేరెంట్స్ కూడా ఉంటారు. దాంతో మనస్థాపానికి గురైన విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్న ఘటనలు ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి కానీ తాజాగా తమ కొడుకుకి అన్ని సబ్జెక్టుల్లో(all subjects) బార్డర్ మార్కులు వచ్చినప్పటికీ ఆ పేరెంట్స్ దాన్ని సెలబ్రేట్ చేశారు.
Video | Vishal Ashok Karad could barely manage 35 marks minimum required for passing SSC exam, but the family celebrated as if he had topped the board. Vishal, a student of Shivai Vidyalay in Uthalsar, Thane has scored unique 35 marks in each subject, His father is a Rickshaw… pic.twitter.com/5lDkW9BRJW