జూ.ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన ‘దేవర’ రేపు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరాలవుతోంది. ఈ వీడియోలో అలలు వచ్చేలా చేయడం, నీళ్లలో కెమెరాను పెట్టి షూట్ చేయడం వంటివి చూపించారు. కాగా, ఈ మూవీ నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్‌లో 2.5 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. ఇక ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించగా.. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ కీలక పాత్రల్లో నటించారు.