»Whats Going On Allu Arjun Not Wished To Ram Charan
చెర్రీ Vs బన్నీ: కనీసం Birthday విష్ చేయని ఐకాన్ స్టార్.. ఏమైంది?
ఇంతలా వీరిద్దరూ దూరమయ్యారో తెలియడం లేదు. కానీ బలమైన కారణం మాత్రం ఉందని తెలుస్తున్నది. చూద్దాం ఇవి విభేదాలా? లేదా ఉత్తుత్తి పుకార్లేనా అనేది కాలమే సమాధానం చెబుతుంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ (Ram Charan Teja) ప్రస్తుతం గ్లోబల్ స్టార్ (Global Star)గా గుర్తింపు పొందుతున్నాడు. అతడి కీర్తి విశ్వవ్యాప్తమవుతోంది. ఆర్ఆర్ఆర్ (RRR Movie) సినిమాతో పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ స్టార్ గా చెర్రీ అవతరించాడు. ఆస్కార్ అవార్డు (Oscar Award) దక్కడం.. విదేశాల్లో మరికొన్ని అంతర్జాతీయ అవార్డులు దక్కడంతో మెగా హీరో పేరు ప్రపంచంలో మార్మోగింది. అలాంటి చెర్రీ జన్మదినం (Birthday) మార్చి 27న హైదరాబాద్ (Hyderabad)లో ఉత్సాహంగా జరిగింది. చెర్రీ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం అభిమానులు (Fans) పండుగ చేసుకున్నారు. సేవా కార్యక్రమాలు భారీ ఎత్తున చేపట్టారు. అయితే తన భర్త జన్మదినం సందర్భంగా భార్య ఉపాసన (Upasana) గ్రాండ్ గా పార్టీ ఇచ్చింది. ఇదంతా హ్యాపీగా జరగ్గా.. అల్లు అర్జున్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. దేశ, విదేశాల నుంచి అందరూ చెర్రీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపగా బన్నీ మాత్రం ఒక్క ట్వీట్, ఒక్క పోస్టు కూడా చేయలేదు. దీంతో పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.
సోషల్ మీడియా (Social Media)లో నిన్నంతా చరణ్ పేరు ట్రెండింగ్ (Trending)లో ఉంది. పెద్ద ఎత్తున సినీ, రాజకీయ, ఇతర ప్రముఖులు చరణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే అల్లు అర్జున్ మాత్రం శుభాకాంక్షలు తెలపలేదు. కనీసం ఉపాసన ఇచ్చిన పార్టీకి కూడా అర్జున్ రాలేదు. ఆ పార్టీకి టాలీవుడ్ తో పాటు ఇతర సినీ పరిశ్రమల ప్రముఖులు హాజరయ్యారు. కానీ అర్జున్ కనిపించలేదు. ఈ నేపథ్యంలో అల్లు కుటుంబానికి కొణిదెల కుటుంబానికి మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే కుటుంబపరంగా కూడా సమస్య లేదని తెలుస్తోంది. ఎందుకంటే పార్టీకి అర్జున్ తండ్రి అల్లు అరవింద్ (Allu Aravind) హాజరయ్యాడు. బన్నీ సోదరుడు అల్లు శిరీష్ (Allu Shirish) చరణ్ కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశాడు.
అల్లు కుటుంబంతో కాదు కేవలం చరణ్ కు, బన్నీకి మధ్య విభేదాలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తున్నది. అందుకే చరణ్ జన్మదినం సందర్భంగా విష్ చేస్తూ ఒక్క పోస్టు కూడా బన్నీ చేయలేదు. సరికదా పార్టీకి కూడా హాజరు కాలేదు. విదేశాల్లో ఉన్నాడంటే ఏమో కానీ హైదరాబాద్ లోనే షూటింగ్ (Shooting)లో అల్లు అర్జున్ ఉన్నాడు. హైదరాబాద్ లో ఉండి పార్టీకి ఎందుకు రాలేదు అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకు వీరిద్దరూ ఇలా తయారయ్యారనేది చర్చ కొనసాగుతోంది. ఇంతలా వీరిద్దరూ దూరమయ్యారో తెలియడం లేదు. కానీ బలమైన కారణం మాత్రం ఉందని తెలుస్తున్నది. చూద్దాం ఇవి విభేదాలా? లేదా ఉత్తుత్తి పుకార్లేనా అనేది కాలమే సమాధానం చెబుతుంది.