»Chiranjeevi Mahesh Babu And Jr Ntr More Birthday Wishes To Ram Charan
HBD Global Star.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది.. చరణ్ కు శుభాకాంక్షల వెల్లువ
పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో సర్జరీ చేసుకోవాలని విమర్శలు చేశారు. అలాంటి విమర్శలు చేసిన వారిచేతనే గ్లోబల్ స్టార్ (Globar Star) హీరో అంటూ గుర్తింపు పొంది రామ్ చరణ్ ప్రత్యేకత చాటుతున్నాడు.
తండ్రి వారసత్వంతో సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన హీరో అనంతరం తండ్రిని మించిన తనయుడిగా గుర్తింపు పొందిన నటుడు రామ్ చరణ్ తేజ్ (Ram Charan Teja). పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో సర్జరీ చేసుకోవాలని విమర్శలు చేశారు. అలాంటి విమర్శలు చేసిన వారిచేతనే గ్లోబల్ స్టార్ (Globar Star) హీరో అంటూ గుర్తింపు పొంది రామ్ చరణ్ ప్రత్యేకత చాటుతున్నాడు. సోమవారం (మార్చి 27) జన్మదినం (Birthday) సందర్భంగా సోషల్ మీడియాలో రామ్ చరణ్ పేరు మార్మోగింది. ఏకంగా ట్విటర్ (Twitter)లో హ్యాపీ బర్త్ డే గ్లోబల్ స్టార్ (#HBDGlobalStarRamCharan) అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. Mega Power Star అనేది కూడా వైరల్ గా మారింది. చరణ్ పుట్టిన రోజు పురస్కరించుకుని సినీ, రాజకీయ, ఇతర ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘గర్వంగా ఉంది నాన్న’ అని తండ్రి, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ట్వీట్ చేయగా.. శంకర్ చరణ్ తో చేస్తున్న సినిమా టైటిల్ ను విడుదల చేశారు. ‘గేమ్ చేంజర్’ (Game Changer) అనే పేరును ఖరారు చేశారు. చరణ్ కు శుభాకాంక్షలు (Wishes) వెల్లువెత్తాయి. శుభాకాంక్షలు తెలిపిన వారు ఎవరెవరో తెలుసా..?
‘ప్రియమైన రామ్ చరణ్ జన్మదిన శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండు. మరో అద్భుతమైన సంవత్సరం నీకోసం ఎదురుచూస్తోంది’ – విక్టరీ వెంకటేశ్ (Daggubati Venkatesh)
‘జన్మదిన శుభాకాంక్షలు చరణ్. మరో గొప్ప అద్భుతమైన సంవత్సరం నీకు రావాలని కోరుకుంటున్నా’ – మహేశ్ బాబు (Mahesh Babu)
Happy birthday, @AlwaysRamCharan! Wishing you yet another incredible year ahead!!
‘జన్మదిన శుభాకాంక్షలు సోదరా’ – జూనియర్ ఎన్టీఆర్ (Jr NT Rama Rao)
నీది ఓ అసాధారణమైన ప్రయాణం. నీకు జన్మదిన శుభాకాంక్షలు – సమంత (Samanta)
జన్మదిన శుభాకాంక్షలు చరణ్. ఒక నటుడిగా.. వ్యక్తిగా నీ అసాధారణమైన అభివృద్ధి చూసి ఆశ్చర్యపోయా. పనిపై నీకు ఉన్న అంకితభావంతో మిలియన్ల మంది మనసులను గెలుచుకున్నాయి. నువ్వు చాలా మందికి స్ఫూర్తి. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా – సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej)
Amazed at your phenomenal growth as an actor & human over the years. May you keep winning millions of hearts with your work and dedication that's truly inspiring. Wishing you a year as wonderful as you are. Loads… pic.twitter.com/aDY3CGSq0n
‘జన్మదిన శుభాకాంక్షలు రామ్ చరణ్. వినయం, కష్టపడి పని చేసే స్వభావమే మిమ్మల్ని నేడు ఈ స్థాయికి చేర్చాయి. మీరు అంచనాలకు మించి ఎదగడాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నా’ – బాబీ, దర్శకుడు (Bobby)
దిల్ రాజు, సంపత్ నంది, శ్రీను వైట్ల, మెహర్ రమేశ్, సుకుమార్, రష్మిక మందాన్న, మంచు మనోజ్, డీవీవీ దానయ్య, మైత్రీ మూవీస్ ప్రతినిధులు, వివేక్ ఒబెరాయ్, రఘురామ కృష్ణం రాజు, గంటా శ్రీనివాస రావు తదితరులు చరణ్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా చరణ్ జన్మదినం సందర్భంగా అతడి అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. రక్తదానం, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరెంజ్ సినిమా మళ్లీ థియేటర్ లలో విడుదల చేయగా.. అభిమానులు సందడి చేశారు. థియేటర్లు హౌస్ ఫుల్ గా కనిపించాయి.