»Watching The Hanuman Movie In The Theater Strange Behavior Of The Woman
Hanuman: థియేటర్లో హనుమాన్ మూవీ చూస్తూ.. మహిళ వింత ప్రవర్తన
హనుమాన్ మూవీని చూస్తూ ఓ మహిళ అసహజంగా ప్రవర్తించింది. తన ప్రవర్తనకు ముందు హడలిపోయిన ప్రేక్షకులు తరువాత అర్థం చేసుకున్నారు. క్లైమాక్స్‌లో హనుమంతుడు వచ్చే సీన్‌కే సదరు మహిళ అలా చేసిందని ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది.
Watching the Hanuman movie in the theater.. strange behavior of the woman
Hanuman: హనుమాన్(Hanuman) సినిమా కలెక్షన్లు చూస్తే ట్రేడ్ పండితుల మతి పోతుంది. చిన్న సినిమాగా విడుదలై పెద్ద సినిమాలతో పోటీ పడింది. విడుదలై 19 రోజులు అవుతున్న అన్ని ఏరియాలో మంచి కలెక్షన్లను రాబడుతోంది. తాజాగా థియేటర్లో హనుమాన్(Hanuman) సినిమా చూస్తూ ఓ మహిళ పూనకంతో ఊగిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
ఉప్పల్ ఏసియన్ మల్టీప్లేక్స్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. హనుమంతుడు రాగానే మహిళలో ఒక్కసారిగా కేకలు పెట్టింది. తనతో వచ్చిన వారు తనను శాంతింపజేశారు. దీనికి సంబంధించిన వీడియోను డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు(Prashant Varma) ట్యాగ్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఏం సినిమా చేశావు బ్రో అంటూ కామెంట్లు చేస్తున్నారు. యంగ్ హీరో తేజ సజ్జ(Teja Sajja), యువ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వచ్చిన హనుమాన్ సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు వచ్చింది. తగినన్ని థియేటర్లు లేక చిత్ర యూనిట్ చాలా ఇబ్బంది పడింది. అసలే పండుగ అందులో పెద్ద సినిమాలు దాంతో హనుమాన్ థియేటర్ల కొరతను ఎదుర్కొంది. అయినా సరే విడుదల చేసి కంటెంట్ ఉంటే చాలు అని నిరూపించుకుంది. రూ. 50 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే రూ. 250 కోట్లు దాటి రూ. 300 కోట్ల క్లబ్లో చేరబోతుంది.