»Leaked Pics Of Allu Arjun Wearing Saree From Pushpa 2 Sets
Allu Arjun: చీర కట్టులో అల్లు అర్జున్.. పిక్ లీక్
అల్లు అర్జున్ చీర కట్టుకున్న ఫోటో ఇంటర్నెట్లో తెగ హల్చల్ చేస్తోంది. పుష్ప 2 చిత్రీకరణలో భాగంగా ఓ సాంగ్ షూట్ నుంచి ఈ ఫోటో లీక్ అయింది. దీంతో బన్ని ఫ్యాన్స్ ఆనందంతో పాటు ఆందోళనలో ఉన్నారు.
Leaked pics of Allu Arjun wearing saree from Pushpa 2 sets
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) కాంబినేషన్లో వస్తున్న చిత్రం పుష్ప: ది రూల్. పార్ట్ 1 గా విడుదలైన పుష్ప(Pushpa 2) ది రైజింగ్ ఎంత సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియా చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డు వసుళ్లను రాబట్టింది. దాంతో పార్ట్2 పై విపరీతమైన అంచనాలను పెంచింది. అల్లు అర్జున్ పుట్టిన రోజును పురస్కరించుకొని గతంలో ఒక గ్లింప్స్‌తో పాటు, ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్లో బన్ని చీర కట్టులో దర్శనం ఇచ్చాడు. దాంతో అసలు ఆ గెటప్ ఎందుకు వేసినట్లు దాని వెనుక ఉన్న నేపథ్యం ఏంటని అందరిలో ఎంతో ఆసక్తి నెలకొంది. తాజాగా లీక్ అయిన పిక్ కూడా అదే లేడీ గెటప్‌లో ఉండడంతో సినిమాలో దానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది అనేది అర్థం అయింది.
తిరుపతి ఏజెన్స్ ప్రాంతంలో ఆచారంగా ఉండే ఈ సంప్రాదాయాన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ గెటప్‌ను క్రియేట్ చేశారని టాక్. దీనిలో భాగంగా జాతరలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని తెలుస్తుంది. తాజాగా లీక్ అయిన పిక్‌లో అల్లు అర్జున్ చీరకట్టుకొని కుర్చిలో కూర్చున్నాడు. పార్ట్ 1 లో చూపించినట్లు ఓ స్పెషల్ సాంగ్ తో పాటు, స్టోరీ రన్ అవుతుంది. అలాగే పార్ట్ 2 లో కూడా ఓ ఐటమ్ సాంగ్‌తో పాటు హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెల్ ఉండబోతుందని సమాచారం. ఆగస్టు 15 న విడుదల చేయడానికి మేకర్స్ సిద్దం అవుతున్నారు. ఈ లీక్‌ల వలన సినిమాపై ఏదైనా ప్రభావం పడుతుందని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.