ఈ సంక్రాంతికి చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద విజయాన్ని సాధించింది హనుమాన్. తేజ సజ్జా హీరోగా, ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. తాజాగా ఈ సినిమా ఓటిటిలోకి వచ్చేది అప్పుడే అంటున్నారు.
Hanuman: హనుమాన్ బడ్జెట్‌కు నాలుగైదు ఎక్కువ రెట్ల వసూళ్లను కొల్లగొట్టింది హనుమాన్. దీంతో మేకర్స్‌కు లాభాల పంట పండుతోంది. ఇప్పటికే 250 కోట్ల రూపాయలు కలెక్షన్లు సాధించి 300 కోట్ల వసూళ్ల దిశగా దూసుకుపోతోంది హనుమాన్. ఈ సినిమా రిలీజ్ అయి రెండు వారాలు దాటిన కూడా సినిమా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. హనుమాన్కు సాలిడ్ హిట్ టాక్ రావడంతో పాటు.. పోయిన వారం తెలుగు నుంచి ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. దీంతో ఇప్పటికీ ఈ సినిమా చూడ్డానికి క్యూ కడుతునే ఉన్నారు జనాలు. ఈ వారం కూడా థియేటర్లో హనుమాన్దే హవా అంటున్నారు. మొత్తంగా థియేట్రికల్ రన్ క్లోజ్ అయ్యేలోపు హనుమాన్ 300 కోట్లకు పైగా రాబడుతుందని అంచనా వేస్తున్నారు. హిందీలో హనుమాన్కు మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటిటి డీల్ క్లోజ్ అయినట్టుగా తెలుస్తోంది.
ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ సంస్థ జీ5 దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీలోను జీ5లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. కానీ ఇప్పుడే కాదని అంటున్నారు. హనుమాన్ థియేట్రికల్ రిలీజ్ అయిన రోజు నుంచి 60 రోజులు తర్వాత ఓటిటిలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రమోషన్స్‌లో వెల్లడించారు. ఆ లెక్కన మార్చి రెండో వారంలో హనుమాన్ డిజిటల్ స్ట్రీమింగ్కు రానుంది. కాబట్టి.. మార్చి వరకు హనుమాన్ కోసం ఓటిటి లవర్స్ వెయిట్ చేయాల్సిందే. ఇక ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా, అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటించారు.