ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’గా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దాంతో ఈ నెల 23న సాయంత్రం 4.05 గంటలకు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు మేకర్స్. బాస్ పార్టీకి అందరూ సిద్ధంగా ఉండండని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పేర్కొంది. దాంతో బాస్ పార్టీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మెగాభిమానులు.
తాజాగా ఫస్ట్ సింగిల్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఇక ఈ ప్రోమో చూస్తుంటే.. థియేటర్లో బాక్సులు బద్దలయ్యేలా కనిపిస్తోంది. ‘వెల్కమ్ టు ది బిగ్గెస్ట్ పార్టీ.. బాస్ పార్టీ.. అంటూ మొదలైన ఈ ప్రోమోని దేవిశ్రీ ప్రసాద్ హుషారెత్తించారు. నువ్వు లుంగీ ఎత్తుకో.. నువ్వు షర్ట్ ముడేసుకో.. నువ్వు కర్చీఫ్ కట్టుకో.. బాస్ వస్తుండు.. బాస్ వస్తుండు.. నువ్వు లైట్లేసుకో.. నువ్వు కలర్ మార్చుకో.. నువ్వు సౌండ్ పెంచుకో.. అంటూ దేవి పాడిన ఈ పాట రచ్చ రంబోలా అనేలా ఉంది.
ఇక నోట్లో బీడితో.. లుంగీ ఎత్తి.. మాస్ స్టెప్పుల కోసం రంగంలోకి దిగిపోయాడు మెగాస్టార్. ప్రస్తుతం ఈ మాస్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాతో అదిరిపోయే స్టెప్పులు వేయనున్నాడు చిరు. ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించడంతో పాటు తనే రాశాడు. దాంతో మరోసారి దేవి మెగాభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయమంటున్నారు. అయితే ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో తెలియాలంటే..
ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సి ఉంది. ఇక ‘వాల్తేరు వీరయ్య’ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తుండగా, శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అందుకే ‘వాల్తేరు వీరయ్య’ పాటలతో పాటు సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.