Vishwak Sen : ‘ధమ్కీ 2’ అనౌన్స్ చేసిన విశ్వక్.. మరి ‘ధమ్కీ’ టాక్ ఏంటి!?
Vishwak Sen : ధమ్కీ సినిమా కోసం ఉన్నదంతా పెట్టేశాడు విశ్వక్ సేన్. ప్రమోషన్లో భాగంగా చాలా సార్లు ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. అలాగే క్లైమాక్స్‌లో బిగ్ సర్ప్రైజ్ ఉంది.. థియేటర్లోకి వెళ్లి చూడండి.. అని సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేస్తూ వచ్చాడు మాస్ కా దాస్. ఇక ఉగాది కానుకగా ధమ్కీ రిలీజ్ అయిపోయింది.
ధమ్కీ సినిమా కోసం ఉన్నదంతా పెట్టేశాడు విశ్వక్ సేన్. ప్రమోషన్లో భాగంగా చాలా సార్లు ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. అలాగే క్లైమాక్స్‌లో బిగ్ సర్ప్రైజ్ ఉంది.. థియేటర్లోకి వెళ్లి చూడండి.. అని సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేస్తూ వచ్చాడు మాస్ కా దాస్. ఇక ఉగాది కానుకగా ధమ్కీ రిలీజ్ అయిపోయింది. ముందు నుంచి చెబుతున్నట్టే.. బాక్సాఫీస్ దగ్గర విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ ఇచ్చి పడేసాడనే టాక్ నడుస్తోంది. సినిమా చూసినవాళ్లు ట్విటర్ వేదికగా ధమ్కీ రివ్యూలు ఇస్తున్నారు. ఓవరాల్‌గా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. వరుస ట్విస్టులు, విశ్వక్ సేన్ డ్యూయెల్ రోల్ హైలెట్ అంటున్నారు. హీరోగా, దర్శకుడిగా విశ్వక్ సత్తా చాటాడని అంటున్నారు. సినిమాలోను రెండు షేడ్స్‌లో అదరగొట్టాడని అంటున్నారు. కానీ కొందరు మాత్రం యావరేజ్ అంటూ.. మిక్స్డ్ టాక్ ఇస్తున్నారు. మెజారిటీ పీపుల్ మాత్రం ఓకె అంటున్నారు. ఇక ఈ సినిమాను బాలయ్య, ఎన్టీఆర్‌లతో గట్టిగా ప్రమోషన్స్ చేయడంతో.. మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. అయితే ముందు నుంచి వినిపిస్తున్నట్టుగా.. ఈ సినిమా క్లైమాక్స్‌లో నిజంగానే ఇచ్చి పడేసాడు విశ్వక్. ఊహించినట్టే ధమ్కీ 2 అనౌన్స్ చేసేశాడు. ఈ సినిమా పక్కా హిట్ అని ఫిక్స్ అయిపోయాడు కాబట్టే.. సీక్వెల్ కూడా ప్రకటించి ఉంటాడు విశ్వక్. అందుకే సెకండ్ పార్ట్ కోసమైనా.. ధమ్కీ బ్లాక్ బస్టర్‌గా నిలవాలని అంటున్నారు దాస్ ఫ్యాన్స్. అందుకు తగ్గట్టే.. ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో ధమ్కీదే హవా అని చెప్పొచ్చు. అయితే ధమ్కీ బాక్సాఫీస్ లెక్కలు, హిట్ టాక్ తేలాలంటే.. వీకెండ్ వరకు వెయిట్ చేయాల్సిందే. మరి ధమ్కీ 2 ఎప్పుడుంటుందో చూడాలి.