రౌడీ హీరో విజయ్ దేవరకొండకు అర్జెంట్‌గా ఒక సాలిడ్ హిట్ కావాలి. ఎట్టి పరిస్థితుల్లోను లైగర్ ఫ్లాప్ నుంచి బయటపడాలని చూస్తున్నాడు విజయ్ దేవరకొండ. దాని కోసం ఎంత హార్డ్ వర్క్ చేసేందుకైనా రెడీగా ఉన్నాడు. అందుకే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘ఖుషి’ సినిమాను పరుగులు పెట్టించాలనుకుంటున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించింది. గతంలో విజయ్-సామ్ మహానటి సినిమాలో కీ రోల్ ప్లే చేశారు. దాంతో ఖుషి సినిమాతో ఈ జోడీ ఆకట్టుకోవడం పక్కా అంటున్నారు. డిసెంబర్ 23న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటికే చాలాభాగం వరకు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని.. వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలనుకుంటున్నాడు రౌడీ. రిలీజ్ టైం దగ్గర పడే సమయంలో.. చివర్లో హడావిడిగా షూటింగ్ చేసే బదులు.. ముందుగానే ఖుషిని కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకే అక్టోబర్ సెకండ్ వీక్‌లో ఖుషీ నెక్ట్స్ షెడ్యూల్ స్టార్ట్ చేయాలనున్నారు. కానీ ఇప్పుడు సమంత డేట్స్ అడ్జెస్ట్మెంట్ అవడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం సామ్ వరుస బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. అంతేకాదు ఏవో కొన్ని కారణాల వల్ల.. సామ్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటుందని వినిపిస్తోంది. దాంతో అనుకున్న సమయంలో ఖుషి కంప్లీట్ అయ్యేలా లేదని సమాచారం. ఈ లెక్కన ఖుషీ విడుదల వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అయితే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాల్సి ఉంది.