»Venkatesh And Rana Remuneration Is Double In Web Series
venki-rana remuneration:బాబాయ్-అబ్బాయ్ డబుల్ చార్జీ, రానా వెబ్ సిరీస్‌కు మరింత హైప్
venki-rana remuneration:బాబాయ్- అబ్బాయి కలిసి నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ (rana naidu) వచ్చే నెల 10వ తేదీ నుంచి నెట్ ప్లిక్స్లో (net flix) స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ట్రైలర్ వదలగా.. ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. వెబ్ సిరీస్ కోసం వెంకీ, రానా ఇద్దరు తమ రెమ్యునరేషన్ డబుల్ తీసుకున్నారు.
venki-rana remuneration:బాబాయ్- అబ్బాయి కలిసి నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ (rana naidu) వచ్చే నెల 10వ తేదీ నుంచి నెట్ ప్లిక్స్లో (net flix) స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ట్రైలర్ వదలగా.. ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. వెబ్ సిరీస్‌పై ఇప్పటికే హైప్ క్రియేట్ అయ్యింది. అమెరికన్ డ్రామా ‘రే డోనేవన్’కు రీమేక్ అయినా.. మంచి స్పందన వస్తోంది. సిరీస్ గురించి ఓ ఆసక్తికర విషయం తెలిసింది. వెబ్ సిరీస్‌ను కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్ వర్మ డైరెక్ట్ చేశారు.
వెబ్‌సిరీస్‌లో నటించేందుకు వెంకటేష్ (venkatesh), రానా (rana) రెమ్యునరేషన్ ఎక్కువే తీసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. సినిమా కన్నా డబుల్ చార్జీ (double charge) చేశారని తెలుస్తోంది. రానా నాయుడు’ లో వెంకటేష్ నాగ (naaga) పాత్రలో కనిపించారు. ఇందుకోసం వెంకీ దాదాపుగా రూ.10కోట్లను (10 crores) రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. రానా కూడా రూ.8కోట్ల (8 crores) పారితోషికం తీసుకున్నారని తెలుస్తోంది. వెంకటేష్ (venkatesh) ఒక్కో సినిమాను చేయడానికి ఐదు కోట్ల నుంచి ఆరు కోట్ల వరకు తీసుకుంటారు. రానా డేట్స్ కోసం ఐదు కోట్ల వరకు ఛార్జ్ చేస్తారు. వెబ్‌సిరీస్ చేయడానికి మాత్రం ఇద్దరు రెండింతల పారితోషికం తీసుకున్నారు.
‘రానా నాయుడు’ (rana naidu) యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కింది. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ఇటీవల విడుదల కాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వెబ్ సిరీస్‌లో సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, గౌరవ్ చోప్రా, ప్రియా బెనర్జీ, ఆశిష్ విద్యార్థి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
మాఫియా సామ్రాజ్యంలో తండ్రి, కొడుకుల (father and son) మధ్య ఆధిపత్యం గురించి వెబ్ సిరీస్ తీశారు. ఎమోషషనల్, రివెంజ్ డ్రామా అని ట్రైలర్ బట్టి అర్థం అవుతుంది. రానా, వెంకీ కలిసి నటించిన తొలి వెబ్ సిరీస్ ఇదీ. ఇటీవల వెంకటేశ్ నెట్ ప్లిక్స్పై సీరియస్ అయిన సంగతి తెలిసిందే. తానే సీనియర్.. హీరో అని.. తన పేరు కాకుండా రానా పేరుతో టైటిల్ ఎలా పెడతారని అన్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది. వెంకీ, రానా ఫ్యాన్స్.. వెబ్ సిరీస్ కోసం ఎదురుచూస్తున్నారు.