Upendra : 100 కోట్లా.. ‘కబ్జ’ పై దారుణమైన ట్రోలింగ్!
Upendra : కేజీయఫ్ సినిమాతో సంచలనం సృష్టించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఆ తర్వాత కాంతార మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాల ప్రభావం కన్నడ మేకర్స్ పై కాస్త గట్టిగానే పడింది. అందుకే ప్రతి ఒక్కరు కెజియఫ్‌ను కొట్టేయాలనే కోణంలోనే సినిమాలు చేస్తున్నట్టుంది.
కేజీయఫ్ సినిమాతో సంచలనం సృష్టించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఆ తర్వాత కాంతార మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాల ప్రభావం కన్నడ మేకర్స్ పై కాస్త గట్టిగానే పడింది. అందుకే ప్రతి ఒక్కరు కెజియఫ్‌ను కొట్టేయాలనే కోణంలోనే సినిమాలు చేస్తున్నట్టుంది. రీసెంట్గా రిలీజ్ అయినా ఉపేంద్ర ‘కబ్జ’ మూవీనే అందుకు నిదర్శనం అని అంటున్నారు. సినిమా ఎంత రిచ్‌గా తీసినా.. కంటెంట్ లేకపోతే కష్టం. కేజీయఫ్, కాంతార సినిమాల కంటెంట్‌కు జనాలు కనెక్ట్ అయ్యారు కాబట్టి.. ఆ సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. కానీ ‘కబ్జ’లో మాత్రం విషయం లేదని తేల్చేశారు ఆడియెన్స్. ఒక్క మాటలో చెప్పాలంటే.. కబ్జ మూవీ కేజీయఫ్ డూప్లికేట్ అంటూ రివ్యూలు వచ్చాయి. ఉపేంద్ర, సుదీప్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్ క్యాస్టింగ్ ఉన్నా.. మొదటి రోజే ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయినా కూడా భారీ వసూళ్లు రాబడుతోందని చెబుతున్నారు మేకర్స్. ఫస్ట్ డే 26 కోట్లు.. రెండో రోజు ఏకంగా 100 కోట్లు రాబట్టిందని పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఇదే ఇప్పుడు కబ్జ మూవీపై ట్రోలింగ్‌కు దారి తీసింది. ఒక్క రోజుకి అంత డిఫరెన్స్ చూపిస్తారా.. అది కూడా మిక్స్డ్ టాక్ వచ్చిన సినిమాకు.. అసలు ఇది ఎలా సాధ్యమనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. చెప్పాలంటే.. ఇవి దారుణమైన ఫేక్ లెక్కలని ట్రోల్ చేస్తున్నారు. సినిమాకు హైప్ క్రియేట్ చేయటానికే ఇలా చేస్తున్నారని అంటున్నారు. మరోవైపు సినిమాలో కొన్ని సీన్స్‌కు కేజీయఫ్ తో పోలుస్తూ ట్రోల్ చేస్తున్నారు. కానీ ‘కబ్జ’ టీమ్ మాత్రం జోరుగా సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది. దాంతో కబ్జ అసలు లెక్కేంటనేది.. హాట్ టాపిక్‌గా మారింది.