Kannada Star Hero ఉపేంద్ర పైనే అందరి దృష్టి.. ‘కబ్జ’ భారీ బిజినెస్!
Upendra : కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నుంచి ఏదైనా కొత్త సినిమా వస్తుందంటే.. ఆటోమేటిక్‌గా జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ప్రస్తుతం అందరి దృష్టి ఉపేంద్ర పైనే ఉంది. రిలీజ్‌కు రెడీగా ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో.. కబ్జ ముందుగా రాబోతోంది. మార్చి 17న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నుంచి ఏదైనా కొత్త సినిమా వస్తుందంటే.. ఆటోమేటిక్‌గా జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ప్రస్తుతం అందరి దృష్టి ఉపేంద్ర పైనే ఉంది. రిలీజ్‌కు రెడీగా ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో.. కబ్జ ముందుగా రాబోతోంది. మార్చి 17న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. పీరియాడికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ మూవీలో సుదీప్ కూడా నటిస్తున్నాడు. శ్రియ హీరోయిన్గా నటిస్తోంది. ఆర్ చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలె ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అవగా.. మంచి బజ్ ఏర్పడింది. కాకపోతే కెజీయఫ్ సినిమాను తలపిస్తోంది. అయితే విజువల్స్ గ్రాండియర్‌గా ఉండడంతో.. కబ్జ పై క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా నటిస్తున్నాడని రివీల్ చేయడంతో.. అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. అందుకు తగ్గట్టే కబ్జ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగినట్టు తెలుస్తోంది. అన్ని భాషలకు చెందిన థియేట్రిక్ బిజినెస్ దాదాపు 65 కోట్ల వరకు జరిగినట్టు తెలుస్తోంది. ఇక డిజిటల్, శాటిలైట్ రైట్స్ కలుపుకొని 100 కోట్లకు పైగా బిజినెస్ అయినట్టు టాక్. రిలీజ్‌కు ముందే.. 100 కోట్ల బిజినెస్ అంటే.. కన్నడ నుంచి మరో సెన్సేషనల్ మూవీ రాబోతుందనే చెప్పొచ్చు. ఇప్పటికే కన్నడ నుంచి వచ్చిన కెజీయఫ్, కాంతార సినిమాలు పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసేశాయి. ఇక ఇప్పుడు కబ్జదే నెక్స్ట్ ప్లేస్ అంటున్నారు. ఈ సినిమాకు కేజిఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండడం.. భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. మరి ఉపేంద్ర ఏం చేస్తాడో చూడాలి.