Jr.NTR : ఆస్కార్ తర్వాత ఎన్టీఆర్ ఫస్ట్ స్పీచ్ ఇదే!
Jr.NTR : మామూలుగా ఎన్టీఆర్ ఏదైనా సినిమా ఈవెంట్‌కి వస్తే.. ఆ సినిమాకు భారీ హైప్ వస్తుంది. బింబిసార, అమిగోస్ సినిమాలకు తారక్ రావడమే పెద్ద ప్లస్. అయితే అమిగోస్ ఈవెంట్లో మాత్రం తన ఫ్యాన్స్‌కు కాస్త క్లాస్ తీసుకున్నాడు తారక్. అప్డేట్ మేమే ఇస్తాం.. ఓపిగ్గా ఉండండి.. అంటూ చెప్పుకొచ్చాడు.
మామూలుగా ఎన్టీఆర్ ఏదైనా సినిమా ఈవెంట్‌కి వస్తే.. ఆ సినిమాకు భారీ హైప్ వస్తుంది. బింబిసార, అమిగోస్ సినిమాలకు తారక్ రావడమే పెద్ద ప్లస్. అయితే అమిగోస్ ఈవెంట్లో మాత్రం తన ఫ్యాన్స్‌కు కాస్త క్లాస్ తీసుకున్నాడు తారక్. అప్డేట్ మేమే ఇస్తాం.. ఓపిగ్గా ఉండండి.. అంటూ చెప్పుకొచ్చాడు. అప్పటి నుంచి టైగర్ ఫ్యాన్స్ కాస్త సోషల్ మీడియాలో సైలెంట్ అయ్యారు. కానీ ఈసారి మాత్రం తగ్గేదేలే అంటున్నారు. ఎన్టీఆర్‌కు గ్రాండ్ వెల్కమ్ ఇవ్వబోతున్నారు నందమూరి ఫ్యాన్స్. ఇప్పటికే సోషల్ మీడియాలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. విశ్వక్ సేన్ కూడా వేరే లెవల్లో ఎన్టీఆర్‌కు వెల్కమ్ చెప్పబోతున్నట్టు చెబుతున్నాడు. ఈ రోజే విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ‘దాస్ కా ధమ్కీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరగబోతోంది. ఆస్కార్ తర్వాత ఎన్టీఆర్ వస్తున్న ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ ఇదే. దాంతో తారక్ ఆస్కార్ గురించి ఏం మాట్లాడతారు.. తెలుగు సినిమాకు వచ్చిన గ్లోబల్ ఇమేజ్ గురించి ఏం చెప్తాడని.. ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. అందుకే అందరి చూపు ఇప్పుడు ‘దాస్ కా ధమ్కీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ మీదే ఉంది. విశ్వక్ సేన్ కూడా ఇదే చెబుతున్నాడు. ఆస్కార్ క్రేజ్‌తో అన్న వస్తున్నాడు.. ఇది తనకు బిగ్ థింగ్ అని అంటున్నాడు. విశ్వక్ సేన్, ఎన్టీఆర్ డై హార్ట్ ఫ్యాన్ అనే సంగతి అందరికీ తెలిసిందే. దాంతో తన అభిమాని మరియు ధమ్కీ సినిమా గురించి ఎన్టీఆర్ ఏం చెప్పబోతున్నాడనేది.. మరింత ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ఎన్టీఆర్ వస్తుండడంతో.. ఈ ఒక్క ఈవెంట్‌తో ధమ్కీ సినిమాపై భారీ హైప్ రావడం పక్కా. మార్చి 22న పాన్ ఇండియా స్థాయిలో ధమ్కీ రిలీజ్ కాబోతోంది. ఏదేమైనా.. ఆస్కార్ తర్వాత ఎన్టీఆర్ ఫస్ట్ స్పీచ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఆడియెన్స్.